సాహో ఎఫెక్ట్ తో సైరాలో కోత

సాహో చిత్రం ఫెయిల్ అవ్వడానికి రన్ టైం కూడా ఒక కారణం. మూడు గంటలు రన్ టైం ఉంటే కథలో కూడా అంతే దమ్ము ఉండాలి. ఎక్కడ [more]

Update: 2019-09-06 11:15 GMT

సాహో చిత్రం ఫెయిల్ అవ్వడానికి రన్ టైం కూడా ఒక కారణం. మూడు గంటలు రన్ టైం ఉంటే కథలో కూడా అంతే దమ్ము ఉండాలి. ఎక్కడ బోర్ అని ప్రేక్షకుడు ఫీల్ అయినా సినిమా రిజల్ట్ పై ఆ ఎఫెక్ట్ పడుతుంది. మూడు గంటలు ఉన్న సినిమాలు హిట్ అయిన సందర్భాల కంటే ఫెయిల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే సైరా రన్ టైం విషయంలో జాగ్రత్త పడుతుంది.

ఇతర భాషల్లోనూ సైరా…

ఈ మూవీ తెలుగు లో కాకుండా హిందీ, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి అక్కడ మార్కెట్ రావాలంటే కచ్చితంగా సినిమాలో ఎక్కడ బోర్ అనిపించకూడదు. అందుకే సైరా నిడివిని తగ్గించే ప్రయత్నాలు ముమ్మరం చేసారు. బాగా ఖర్చు చేసి షూట్ చేసిన ఫైట్ సీక్వెన్స్ లు, భారీ కాస్టింగ్ తో తీసినా సీన్స్ ఏమాత్రం స్లో అని అనిపించినా అవి ట్రిమ్ చేసేయాలని చూస్తున్నారట.సినిమా రన్ టైం ఎంత కుదిస్తే అంత మంచిది అని సైరా టీం భావిస్తుంది. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకుని వస్తున్నా సైరా అక్టోబర్ 2 న రిలీజ్అవుతుంది. మరి దీని రిజల్ట్ ఏమవుతుందో చూడాలి.

Tags:    

Similar News