సైరా విషయంలో అలా చేయట్లేదు

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సన్షేషనల్ సైరా సినిమా పై ఫ్యాన్స్ లో ఎటువంటి అంచనాలు ఉన్నాయో వేరే చెప్పనవసరం లేదు. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ [more]

Update: 2019-09-16 07:57 GMT

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సన్షేషనల్ సైరా సినిమా పై ఫ్యాన్స్ లో ఎటువంటి అంచనాలు ఉన్నాయో వేరే చెప్పనవసరం లేదు. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకుడు ఎదురు చూడడం విశేషం. ఎందుకంటే ఇది ఒక తెలుగు వీరుడి కథ. ఈ కథ గురించి తెలుసుకోవాలని చాలా మంది ఆతృతగా ఉన్నారు.

పుకార్లు ఎందుకు…?

ఇక ఈ మూవీలో మెయిన్ అంశం అయినా ఒరిజినల్ స్టోరీ ప్రకారం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ సేనల చేతిలో అతి క్రూరంగా చంపబడినట్టు చూపించారా? లేదా? అని మొదటి నుంచి మెదులుతున్న ప్రశ్న. చిరు లాంటి స్టార్ హీరోని లాస్ట్ లో చంపినట్టు చూపిస్తే దాన్ని అభిమానులు అంగీకరించలేరని అందుకే దాన్ని మార్చారనే పుకార్లు పుట్టుకొచ్చాయి. కానీ చరిత్రను మార్చడం సబబు కాదు కాబట్టి మెగా టీమ్ సాహసించి నరసింహారెడ్డి వీర మరణాన్నే ముగింపుగా ఎంచుకున్నారట. ఈ సన్నివేశాలు చాలా భావోద్వేగంతో తెరకెక్కించారని దానికి ప్రేక్షకులు కన్విన్స్ అవుతారు అని నమ్ముతున్నారు. అక్టోబర్ 2 న రిలీజ్ అవుతున్న ఈ సినిమా యొక్క ట్రైలర్ లాంచ్ ఈనెల 18 న హైదరాబాద్ లో చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు.

 

Tags:    

Similar News