బాలీవుడ్ లో బాదెయ్యడం ఖాయం

టాలీవుడ్ సినిమాలు ఇప్పుడు ఇండియా వైడ్ గా విడుదల కావడానికి రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా హిందీ మార్కెట్ ని టార్గెట్ చేస్తూ సినిమాలు విడుదలవుతున్నాయి. బాహుబలి స్ఫూర్తి [more]

Update: 2019-09-20 07:45 GMT

టాలీవుడ్ సినిమాలు ఇప్పుడు ఇండియా వైడ్ గా విడుదల కావడానికి రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా హిందీ మార్కెట్ ని టార్గెట్ చేస్తూ సినిమాలు విడుదలవుతున్నాయి. బాహుబలి స్ఫూర్తి తో నిన్నగాక మొన్న సాహో సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా… బాలీవుడ్ లో లాభాల కలెక్షన్స్ సాధించింది. ప్రభాస్ బాహుబలి క్రేజ్ తో సాహో సినిమా అక్కడ హిట్ కలెక్షన్స్ సాధించింది. మరి తాజాగా బోలెడంత హైప్ మధ్యన విడుదల కాబోతున్న సైరా సినిమా కూడా హిందీ లో వర్కౌట్ అవుతుందని తాజాగా విడుదలైన సై రా నరసింహారెడ్డి ట్రైలర్ కొచ్చిన స్పందనే చెబుతుంది.

అన్ని భాషల్లోనూ క్రేజ్…..

టాలీవుడ్ తో పాటుగా విడుదలైన సైరా హిందీ ట్రైలర్ కి రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. మొదట్లో సైరాకి హిందీలో క్రేజెంతుందో తెలియక రామ్ చరణ్ అండ్ టీం కంగారు పడినా.. తాజాగా సైరా ట్రైలర్ కొచ్చిన స్పందనతో ఆ టెన్షన్ వదిలేశారు. మరోవైపు సైరా సినిమా మీద హిందీ ప్రేక్షకుల్లో ఎంత ఆసక్తి ఉందొ కూడా సైరా ట్రైలర్ తోనే ప్రూవ్ అయ్యింది. తెలుగులోనే కాదు.. సైరా నరసింహారెడ్డి మీద అన్ని భాషల్లోనూ బోలెడంత క్రేజ్ ఉంది. అమితాబ్ నటించడం ఒక ఎత్తైతే… సై రా సినిమా యాక్షన్ సీన్స్ అన్ని హాలీవుడ్ రేంజ్ లో ఉండడం, యావరేజ్ అనిపించుకున్న సాహో కే పట్టం కట్టిన బాలీవుడ్ జనాలు… ఈ సైరాకీ హిట్ టాక్ వస్తే కలెక్షన్స్ పరంగా రికార్డులు కొల్లగొట్టేయ్యడం ఖాయమంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

 

Tags:    

Similar News