అక్కడా.... ఇక్కడా యావరేజేనా..!!

Update: 2018-12-22 06:24 GMT

సాయి పల్లవి తెలుగు, తమిళ సినిమాల్తో బాగా బిజీ అయ్యిది. స్టార్ హీరోల పక్కన ఛాన్స్ లు రాకపోతేనేమి.. మీడియం రేంజ్ హీరోలతో జోడి కడుతూ దూసుకుపోతుంది. తెలుగులో మీడియం రేంజ్ హీరోలతోనే సరిపెట్టుకుంటున్న సాయి పల్లవి తమిళనాట మాత్రం ధనుష్, సూర్య వంటి స్టార్ హీరోల సరసన నటిస్తుంది. ప్రస్తుతం సాయి పల్లవి కి డిసెంబర్ 21 బిగ్ డే. ఎందుకంటే సాయి పల్లవి నటించిన రెండు సినిమాలు డిసెంబర్ 21 నే విడుదలయ్యాయి. తెలుగులో శర్వానంద్ తో కలిసి నటించిన పడి పడి లేచే మనసు, తమిళంలో ధనుష్ సరసం నటించిన మారి 2 రెండు చిత్రాలు ఒకేరోజు విడుదలవడంతో... సాయి పల్లవి కి డిసెంబర్ 21 బిగ్ డే అయ్యింది.

అదరగొట్టే నటనతో....

అయితే సాయి పల్లవి రెండు సినిమాలలోనూ అదరగొట్టే నటనతో ఆకట్టుకుంది. పడి పడి లేచే మానసులో శర్వానంద్ కి జోడిగా డాక్టర్ పిల్లగా, శర్వా తో రొమాంటిక్ సన్నివేశాల్లోను, ఎమోషన్స్ సీన్స్ లోనూ సాయి పల్లవి నటన సూపర్బ్. సాయి పల్లవి నటనే పడి పడి లేచే మనసుకు హైలెట్ ఆంటే... ఇక సాయి పల్లవి ఎలా నటించిందో అర్ధమవుతుంది. డాన్స్ లోను సాయి పల్లవి అదరగొట్టేసింది. అయితే శర్వా, సాయి పల్లవుల నటన పడి పడి లేచే మనస్సుని సూపర్ హిట్ చేయలేకపోయాయి. ఆ సినిమాలో ఉన్న కొన్ని మైనస్ ల వల్ల సినిమాకి యావరేజ్ టాక్ పడింది. క్రిటిక్స్ కూడా పడి పడి కి యావరేజ్ మార్కులే వేశారు.

మారి 2లోనూ....

ఇక సాయి పల్లవి మరో సినిమా మారి 2 తెలుగులో కూడా విడుదలైంది. ఈ సినిమాలో ధనుష్ కి జోడిగా మాస్ పిల్లగా అలరించిన సాయి పల్లవి నటన పరంగా అదరగొట్టింది. ధనుష్ సిక్స్ ప్యాక్, మాస్ నటనకు తోడు, ఆటో డ్రైవర్ పాత్రలో.. ఎవరికీ భయపడని చలాకీ అమ్మాయిల సాయి పల్లవి నటన సూపర్ అనేలా ఉంది. ఆనంది పాత్రలో సాయి పల్లవి తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మాస్ క్యారెక్టర్ లో ఉన్న ధనుష్ ని ఆమె ఆటపట్టించిన తీరు ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తోంది. సినిమాలో వీరి కాంబినేషన్ కి మంచి మార్కులు అపడుతున్నాయి. అయితే ఈ సినిమా కూడా యావరేజ్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరి టోటల్ గా సాయి పల్లవి తెలుగు పడి పడి లేచే మనసుతోను, తమిళ మారి 2 తోనూ యావరేజే అందుకుంది కానీ.. హిట్స్ అందుకోలేకపోయింది.

Similar News