సాయి పల్లవి ఆ కేరెక్టర్ చెయ్యడం లేదు!!

సాయి పల్లవి ఏ సినిమా అయినా తన పాత్రకి ప్రాధాన్యత ఉండడం ఒకటి, కథ లో బలం ఉంటేనే సినిమా ఒప్పుకుంటుంది. తాజాగా సాయి పల్లవి టాలీవుడ్ [more]

Update: 2020-07-13 08:29 GMT

సాయి పల్లవి ఏ సినిమా అయినా తన పాత్రకి ప్రాధాన్యత ఉండడం ఒకటి, కథ లో బలం ఉంటేనే సినిమా ఒప్పుకుంటుంది. తాజాగా సాయి పల్లవి టాలీవుడ్ లో రెండు సినిమాలు చేసింది. నాగ చైతన్య తో లవ్ స్టోరీ, వేణు ఉడుగుల దర్శకత్వంలో విరాట పర్వం సినిమాలు చేస్తుంది. రెండు సినిమాల షూటింగ్స్ చివరి దశలోనే ఉన్నాయి. విరాట పర్వం అయితే కేవలం పది రోజుల షూటింగ్ మాత్రం మిగిలి ఉండగా కరోనా అడ్డం పడింది అయితే ఈ సినిమాలో సాయి పల్లవి నక్సలైట్ గా కనిపిస్తుంది అని.. సాయి పల్లవి విరాట పర్వం ఫస్ట్ లుక్ బయటికి వచ్చాక ఆమె పాత్రపై మరింత క్యూరియాసిటీ, ఊహాగానాలు పెరిగిపోయాయి.

అయితే నక్సలైట్ గా సాయి పల్లవి విప్లవ గాయని బెల్లి లలిత పాత్రలో కనిపించనుందనే ప్రచారానికి ఆ సినిమా దర్శకుడు వేణు ఉడుగుల ఫుల్ స్టాప్ పెట్టాడు. సాయి పల్లవి నక్సలైట్, విప్లవ గాయని బెల్లి లలిత పాత్ర చెయ్యడం లేదని.. నేను పుట్టి పెరిగిన వరంగల్‌లో సమాజంలో మార్పు కోసం ఎలాంటి భయం లేకుండా ఉద్యమాలను లేవదీసినవాళ్లను నేను చూశాను. అవన్నీ ఇప్పుడు విరాటపర్వంలో చూపిస్తున్నాను అని చెబుతున్నాడు వేణు ఉడుగుల. బెల్లి లలిత పాత్రను సాయి పల్లవి పోషించడం లేదు. అయితే విరాట పర్వంలో ఆమె పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాకు ఎంతో కీలకం ఆ పాత్ర. అలాంటి రోల్‌లో సాయి పల్లవి అద్భుతంగా ఒదిగిపోయి నటించింది. ఆమె నటన కచ్చితంగా అందరినీ మెప్పిస్తుంది అంటూ విరాట పర్వంలో సాయి పల్లవి రోల్ పై స్పష్టతనిచ్చాడు వేణు ఉడుగుల

Tags:    

Similar News