ఆదిపురుష్ విలన్ పై ట్రోలింగ్?

ప్రభాస్ ఆరడుగుల అందగాడు. మరి ప్రభాస్ విలన్ అంటే ఆరడుగులు ఉండక్కర్లేదు. కానీ ప్రభాస్ కి సరిపోయే పర్సనాలిటీ కానీ, క్రేజ్ కానీ ఉండాలి. కానీ ప్రభాస్ [more]

Update: 2020-09-04 08:05 GMT

ప్రభాస్ ఆరడుగుల అందగాడు. మరి ప్రభాస్ విలన్ అంటే ఆరడుగులు ఉండక్కర్లేదు. కానీ ప్రభాస్ కి సరిపోయే పర్సనాలిటీ కానీ, క్రేజ్ కానీ ఉండాలి. కానీ ప్రభాస్ ఓం రనౌత్ తో చెయ్యబోయే ఆదిపురుష్ సినిమా కోసం ప్రబస్ పక్కన చాలా చిన్నగా కనిపించే తానాజీ ఫేమ్ సైఫ్ అలీ ఖాన్ ఏమి ఆనతాడు… అనేది ఇప్పుడు ప్రభాస్ ఫాన్స్ ముందున్న ప్రశ్న. సైఫ్ అలీ ఖాన్ ఒకప్పుడు బాలీవుడ్ టాప్ హీరో. తానాజీలో విలన్ గా అదరగొట్టేసాడు. అందుకే ఓం రనౌత్ ప్రభాస్ ఆదిపురుష్ కోసం రావణ్ గా సైఫ్ అలీ ఖాన్ ని సెలక్ట్ చెయ్యడం,.. దాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది.

అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆదిపురుష్ విలన్ రావన్ గా సైఫ్ అలీ ఖాన్ తేలిపోవడం ఖాయమని, అసలు ప్రభాస్ ముందు సైఫ్ ఎంత పెరఫార్మెన్స్ చేసిన ఆహార్యం పరంగా అనడని, ఖచ్చితంగా తేలిపోతాడని అంటున్నారు. ప్రభాస్ కి విలన్ గా రావణ్ పాత్రకి ఏ అక్షయ్ కుమారో?లేదంటే అజయ్ దేవగన్ అయితే బావుండేది అంటూ సోషల్ ఇండియాలో ఆదిపురుష్ విలన్ పై ట్రోలింగ్ మొదలయ్యింది. ప్రభాస్ రాముడి గెటప్ లో, సైఫ్ అలీ ఖాన్ రావణ్ గెటప్ లో ఎదురు బోదురు కనబడితే.. ప్రేక్షకులు విజిల్స్ వెయ్యడం కాదు నవ్వుతారు అని అంటున్నారు. మరి బాలీవుడ్ లో ప్రభాస్ ఇప్పుడు ఆదిపురుష్ తో డైరెక్ట్ గా పాగా వెయ్యడాన్ని చాలామంది బాలీవుడ్ హీరోలు జీర్ణించుకోలేకపోతున్నారనేది బి టౌన్ టాక్. అలాంటిది ప్రభాస్ విలన్ గా క్రేజ్ ఉన్న హీరోలను అడిగితె వాళ్ళు ఒప్పుకోరు గనుకనే ఓం రనౌత్ తానాజీ విలన్ సైఫ్ అలీ ఖాన్ రావన్ గా సరిపెట్టేసాడని అంటున్నారు.

Tags:    

Similar News