సాయి పల్లవి జీవితం ఈమూవీతోనే ముడిపడి ఉందా?

సినిమాలో తన పాత్ర కు ఇంపార్టెన్స్ ఉంటేనే చేస్తా అనే సాయి పల్లవి యూట్యూబ్ లో తన పాటలకి రికార్డ్స్ వ్యూస్ వస్తున్నాయనేదే తప్ప ఆమె నటించిన [more]

Update: 2019-05-30 04:16 GMT

సినిమాలో తన పాత్ర కు ఇంపార్టెన్స్ ఉంటేనే చేస్తా అనే సాయి పల్లవి యూట్యూబ్ లో తన పాటలకి రికార్డ్స్ వ్యూస్ వస్తున్నాయనేదే తప్ప ఆమె నటించిన సినిమాలు ఒక్కటి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టలేదు. సో ఇప్పుడు సాయి పల్లవికి హిట్ అనేది చాలా అవసరం.

ఒకవేళ ఇప్పుడు కూడా హిట్ రాకపోతే ఆమెతో సినిమాలు చేద్దాం అనుకున్న ప్రొడ్యూసర్స్ కొంచం వెనక్కి తగ్గే అవకాశముంది. ఈనేపధ్యంలో ఆమె నటించిన ‘ఎన్‌జికె’ చిత్రం తెలుగు, తమిళంలో ఈ శుక్రవారం అంటే 31 న రిలీజ్ కానుంది. సూర్య ప్రధాన పాత్రలో వస్తున్నా ఈసినిమాలో సాయి పల్లవి కి ఇంపార్టెంట్‌ రోల్‌ వుంటుందని అనుకోవచ్చు.

అలా లేకపోతే సినిమాలు చేయదు కదా. ఈమూవీ తో అయినా సాయి పల్లవి ఫెయిల్యూర్స్‌కి బ్రేక్‌ పడి మళ్లీ ఆమె క్రేజ్‌ మునుపటి స్థాయిలో వుంటుందా లేదా అనేది మే 31 సాయంత్రానికి తెలిసిపోతుంది. ఇక ఈచిత్రాన్ని సెల్వ రాఘవన్ డైరెక్ట్ చేసాడు. ఇది పొలిటికల్ డ్రామా.

Tags:    

Similar News