దర్శకనిర్మాతలకు షాకిస్తున్న సాయి పల్లవి

టాలీవుడ్ లో, కోలీవుడ్ లో సాయి పల్లవికున్న క్రేజ్ మామూలుది కాదు. ఫిదా, ఎంసీఏ, పడి పడి లేచే మనసు చిత్రాలతో రివ్వున లేచిన సాయి పల్లవికి [more]

Update: 2019-11-07 05:50 GMT

టాలీవుడ్ లో, కోలీవుడ్ లో సాయి పల్లవికున్న క్రేజ్ మామూలుది కాదు. ఫిదా, ఎంసీఏ, పడి పడి లేచే మనసు చిత్రాలతో రివ్వున లేచిన సాయి పల్లవికి ప్లాప్స్ ఉన్నప్పటికీ.. ఆమె సినిమాలంటే ప్రేక్షకులకు భలే ఇంట్రెస్ట్. ఇక సాయి పల్లవి ముందు నుండి గ్లామర్ షోకి, లిప్ లాక్ లకు చాలా దూరం. దర్శకనిర్మాతలకు మొహమాటం లేకుండా చెప్పేస్తుంది కూడా. తాజాగా డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరూ సినిమావాళ్లు సాయి పల్లవిని సంప్రదించినా ఆమె మాత్రం నో చెప్పింది. కారణం ఆ సినిమాల్లో లిప్ లాక్స్ ఉంటాయనితెలిసి. ఇక కొంతమంది సాయి పల్లవి ఇమేజ్ కి తగిన కథలను ప్రిపేర్ చేస్తున్నారు.

అయినా ఆసినిమాలో తన పాత్ర నచ్చకపోతే సాయి పల్లవి వారికి మొహమాటం లేకుండా చెప్పేస్తుంది. అన్ని కండిషన్స్ పెట్టినా సాయి పల్లవి క్రేజ్ మాత్రం కోటికి తగ్గడం లేదు. లిప్ లాక్, గ్లామర్ షో చేయకపోయినా… సాయి పల్లవికి కోటి పైనే ఇవ్వాల్సిందే. లేదంటే సినిమా చెయ్యనని చెబుతుంది. పాపం దర్శకనిర్మతలు సాయి పల్లవి కండిషన్స్ కి లోబడి ఆమె అడిగింది ఇచ్చుకుంటున్నారు. ఏం చేస్తారు ఆమె క్రేజ్ అలాంటిది. ఇక సాయి పల్లవి విరాట పర్వం, శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ లోను నటిస్తుంది. మరి ఈ రెండు సినిమాల్లోనూ ఆమె పాత్రే హైలెట్ కావడం గమనార్హం.

Tags:    

Similar News