భారీ పారితోషకం ఆఫర్ చేసినా.. వద్దు పొమ్మంది

సినిమా స్టార్స్ యాడ్స్ చేస్తూ.. ఓ కంపెనీ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారంటే.. ఆ కంపెనీ ప్రొడక్ట్స్ కి గిరాకీ పెరుగుతుంది. ఇంకా ఆ స్టార్ [more]

Update: 2019-11-20 06:19 GMT

సినిమా స్టార్స్ యాడ్స్ చేస్తూ.. ఓ కంపెనీ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారంటే.. ఆ కంపెనీ ప్రొడక్ట్స్ కి గిరాకీ పెరుగుతుంది. ఇంకా ఆ స్టార్ కి బాగా గిట్టుబాటు అవుతుంది. అందుకే సినిమాల్లో క్రేజ్ ఉన్న స్టార్స్ ని తమ కంపెనీ ప్రోడక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోవడంలో పలు కంపెనీ లు పోటీ పడతాయి. స్టార్స్ చిన్న పనికి పెద్దమొత్తం వస్తుంటే ఎందుకు కాదంటారు. మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ తమ క్రేజ్ ని పలు యాడ్స్ కి ఉపయోగిస్తున్నారు. కానీ ఓ క్రేజీ తార మాత్రం ఓ గిరి గీసుకుని ఆ బరిలో కూర్చుంది. తన పాలసీకి యాడ్స్ వ్యతిరేకమని, గ్లామర్ షో చెయ్యనని, లిప్ లక్స్ కి దూరమని చెబుతుంది.

ఆమే సాయి పల్లవి. సాయి పల్లవి నటిస్తున్న సినిమాలు ప్లాప్ అయినా.. సాయి పిల్లకి బోలెడంత క్రేజ్. అందుకే సాయి పల్లవిని తమ ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమని పలు కంపెనీలు వెంటపడినా.. సాయి పల్లవి మాత్రం టెంప్ట్ అవలేదు. తాజాగా సాయి పల్లవి కోసం ఓ పెద్ద బట్టల దుకాణం వారు… భారీ పారితోషకం ఇస్తామని తమ కంపెనీ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమని… చిన్నపాటి యాడ్ చేస్తే సరిపోతుందని బ్రతిమాలినా సాయి పల్లవి మాత్రం తన రూల్స్ ని మీరనని సున్నితంగా చెప్పి పంపింది. మరి సాయి పల్లవిని చూస్తే జాలేస్తుంది. హీరోయిన్స్ అంటే క్రేజ్ ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సూత్రాన్ని విస్మరిస్తోంది

Tags:    

Similar News