క్లాస్.. మాస్ పోటీ పడితే.. ఆ కిక్కే వేరప్పా ...!

Update: 2018-12-05 08:48 GMT

ఫిదా చిత్రంలో క్లాస్ అమ్మాయిగా మాస్ వాయిస్ తో అలరించిన సాయి పల్లవి.. కణం సినిమాలో క్లాస్ గా ఆకట్టుకుంది. ఇక ఎంసీఏలోనూ మిడిల్ క్లాస్ అమ్మాయిలా నటించిన సాయి పల్లవి... ఒకే ఏడాది ఒక క్లాస్ క్యారెక్టర్, ఒక మాస్ క్యారెక్టర్ చేసిన మూవీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అది కూడా ఒకే డేట్ కి అంటే ఆ మజా ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇంతకీ సాయి పల్లవి ఈ క్లాసు మాసు గోలేమిటంటే... టాలీవుడ్ లో శర్వానంద్ తో కలిసి మెడికోగా క్లాస్ లుక్ పడి పడి లేచే మనసు లో నటిస్తుంది. ఈ సినిమా లోని పాటల్లో సాయి పల్లవి లుక్స్ సూపర్. ఈ చిత్రం డిసెంబర్ 21 న విడుదల కాబోతుంది.

ఒకేరోజు రెండు సినిమాలతో...

అయితే, సాయి పల్లవి మాస్ లుక్ లో నటించిన తమిళ మూవీ మారి 2 కూడా డిసెంబర్ 21 మీదే కన్నేసింది. ధనుష్ తో కలిసి ఊర మాస్ లుక్ లో నటించిన సాయి పల్లవి.. ఆ సినిమాలో ఆటో డ్రైవర్ గా మాస్ గా కనిపిస్తుంది. మాస్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కిన మారి 2 మీదా మంచి అంచనాలే ఉన్నాయి. మాస్ క్యారెక్టర్, మాస్ లుక్స్ తో ఉన్న సాయి పల్లవి మారి 2 తో... టాలీవుడ్ లో క్లాస్ లుక్ లో ఉన్న పడి పడి లేచే మనసు సినిమాతో పోటీ పడుతుంది. కాకపోతే మారి తమిళ మూవీ ఆ సినిమా అక్కడ మాత్రమే విడుదలవుతుంది. ఇక డబ్బింగ్ చేసుకుని తెలుగులో దిగే సూచనలు లేవు. మరి ఒకే రోజు ఒకే డేట్ కి తెలుగు సినిమాతో, తమిళ సినిమాతో సాయి పల్లవి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనుంది.

Similar News