మళ్ళీ ఫిదా చేసిందిగా

Update: 2018-05-09 09:23 GMT

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన సాయి పల్లవి తాజాగా కణం సినిమాతోనూ అదరగొట్టేసింది. సాయి పల్లవి కి మళయాళంలోనే కాదు తెలుగు, తమిళంలోనూ కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. సాయి పల్లవి ఏ హీరో పక్కన నటించినా ఆ హీరో కన్నా ఎక్కువగా పేరు సాయి పల్లవికి వస్తుంది. ఫిదా, ఎంసీఏ, కణం సినిమా ల్లో సాయి పలలవి నటనకు ఎంత పేరొచ్చిందో తెలిసిందే. ఆమె నాట్యమయూరి. నటనలో ఆమెకి ఆమె సాటి. ఎంతో నేచురల్ యాక్టింగ్ తో అందరిని మెస్మరైజ్ చేస్తుంది. ప్రస్తుతం తెలుగులో సాయి పల్లవి శర్వానంద్ పక్కన హను రాఘవపూడి దర్శహకత్వంలో పడి పడి లేచే మనసు సినిమాలో నటిస్తుంది.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న పడి పడి లేచే మనసు ఫస్ట్ లుక్ ని శర్వానంద్ పుట్టిన రోజు సందర్భంగా మార్చ్ లోనే విడుదల చేసిన చిత్ర బృందం... ఇప్పడు సాయి పల్లవి పుట్టినరోజు మే 9 బుధవారం సాయి పల్లవి లుక్ ని విడుదల చేసింది. మరి ఆ లుక్ లో సాయి పల్లవి అందమైన తెల్లని రంగు బెంగాలీ త‌ర‌హా చీర‌కట్టుతో... చేతినిండా గాజులతో.. మొహానికి రంగులు పూసుకుని నృత్యం చేస్తున్న భంగిమలో సాయి పల్లవి ఉంది . రంగుల మధ్యన సాయి పల్లవిని చూస్తుంటే మళ్ళీ హిట్ కొట్టేస్తుందిలే అన్నట్టుగా వుంది. అలాగే మరో పోస్టర్ లో శర్వానంద్.. సాయి పల్లవిని పరిగెత్తిస్తుంటాడు. మరి వాళ్ళిద్దరి జోడి బావుంది కూడా.

ఇక ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా కోల్‌క‌తాలోనే తీశారు. అందుకే అక్కడి స్టయిల్ ఉట్టిపడేలా కనబడుతుంది సాయి పల్లవి పాత్ర తీరు తెన్నులు. ఇక ఈ సినిమాకి విశాల్- శేఖ‌ర్ సంగీతమందిస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటుగా శర్వానంద్ సుధీర వర్మ దర్శకత్వంలో మరో మూవీ లో నటిస్తున్నాడు

Similar News