లిప్ లాక్స్ కి చేయను అంటున్న స్టార్ హీరోయిన్

Update: 2018-12-23 09:36 GMT

ఈమధ్య కాలంలో టాలీవుడ్ మూవీస్ లో ముద్దు సీన్లనేవి చాలా కామన్ అయిపోయాయి. ఒకప్పుడు ముద్దు సీన్స్ అంటే మన ఇండస్ట్రీ చాలా దూరంగా ఉండేది. కానీ గత కొంత కాలం నుండి ఆ బార్ గేట్ తొలగిపోయింది. యూత్ కి కనెక్ట్ అవ్వాలంటే లిప్ లాక్ కంపల్సరీ అన్నట్టు తీస్తున్నారు మన డైరెక్టర్స్. బాలీవుడ్ లో అయితే ఇంతకు మించి వేరేగా ఉంటుంది అది వేరే విషయం అనుకోండి.

అయితే మన తెలుగమ్మాయిలు ఇటువంటి సీన్స్ చేయడానికి రెడీ గా ఉన్నారు. కానీ మొదటి సినిమాతోనే పాపులర్ అయినా సాయి పల్లవి నేను ముద్దు సీన్ లకు దూరం అంటుంది. తాను లిప్ లాక్ సీన్లలో నటించనని తేల్చి చెప్పింది. లేటెస్ట్ గా జరిగిన ఇంటర్వ్యూ లో ఈ విషయం గురించి చెప్పింది సాయి పల్లవి. అలా అని నేను ఆ సీన్స్ సినిమాల్లో ఉండకూడదు అని అనడంలేదు అంటుంది.

అంతే కాదు గ్లామర్ షో కి సైతం దూరం అంటుంది. "చిట్టి పొట్టి దుస్తులు వేసుకోను. అలాగ‌ని నేను వాటికి వ్య‌తిరేకం కూడా కాదు. అలాంటి వాటిలో త‌ప్పేమీ లేదు. కాకపోతే నాకు అవి సౌకర్యంగా ఉండవు’’ అని తన మనసులో మాట చెప్పింది. అలానే వ్యాపార ప్రకటనల్లో కూడా నటించనని చెబుతుంది. నా వరకు సినిమాల నుండి బాగానే డబ్బు వస్తుంది. అలాంటప్పుడు వేరే వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది అని అంటుంది. మరి ఈ రోజుల్లో ఇలా మడి కట్టుకుని కూర్చుంటే కరెక్ట్ కాదేమో అని అంటున్నారు.

Similar News