సాయి ధరమ్ తేజ్ కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్!

Update: 2018-05-19 07:20 GMT

వీకెండ్స్ అంటే చాలు సరదాగా కాసేపు నైట్ ఎక్కడైనా పార్టీ చేసుకుని ఇంటికి వెళ్తున్నారు. వారంలో ఐదు రోజులు గొడ్డి చాకిరి చేసి శని, ఆదివారాల్లో ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకుని ఇంటికి వెళ్తుంటారు చాలా మంది. అలానే మన హీరోలు, హీరోయిన్లు కూడా ప్రతి వీకెండ్ ఎంజాయ్ చేస్తుంటారు.

వల పన్నుతున్న పోలీసులు....

పార్టీ అంటే కంపల్సరీగా మందు ఉంటుంది. వీకెండ్ లో రిలీఫ్ కోసం చాలా మంది మందు సేవించి ఇంటికి వెళ్తుంటారు. అయితే అదే నైపథ్యంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో పోలీసులు పలు చోట్ల డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఆ సందర్భంగా చాలా మంది మందు బాబులు బుక్ అయ్యారు. మొత్తం మీద 22 కార్లు, 29 బైకులు, ఒక ఆటోను పోలీసులు సీజ్ చేశారు.

సాయి ధరమ్ తేజ మంచి బాలుడేగా...

చాలా మంది ఫుల్ గా మద్యం తాగిన వారు కారును ఇవ్వాలంటూ ప్రాధేయపడినా పోలీసులు కరుణించలేదు. అయితే అదే సమయంలో హీరో సాయిధరమ్ తేజ్ అటుగా వెళ్తుండగా, ఆయనను పోలీసులు ఆపారు. అందరి మాదిరిగానే ఆయనకు కూడా బ్రీత్ అనలైజర్ టెస్టును నిర్వహించారు. అయితే టెస్టులో '0' పాయింట్లు వచ్చాయి. దాంతో ఆయనను పోలీసులు పంపించేశారు.

Similar News