సాయిధరమ్ తేజ్ కి కొత్త సమస్య

Update: 2018-07-16 06:48 GMT

మెగా కుటుంబం నుంచి వచ్చిన హీరో సాయిధరమ్ తేజ్ కి కాలం అస్సలు కలిసి రావడం లేదు. ఆయన నటించిన జవాన్, ఇంటలిజెంట్, తేజ్ ఐ లవ్ యూ వరుసగా ఫ్లాప్ అయ్యాయి. హ్యాట్రిక్ ఫ్లాప్లతో ఆయనకు టెన్షన్ పెరిగిపోయిందంట. దీంతో కొత్త సమస్య వచ్చి పడింది. ఇంకా 30 ఏళ్లు కూడా దాటని ఆయనకు వెంట్రుకలు ఊడుతున్నాయంట. మామూలుగా పని ఒత్తిడి, టెన్షన్ వల్ల కూడా ఎక్కువగా హెయిర్ లాస్ ఉంటుందని అంటారు డాక్టర్లు. దీంతో ఇప్పటికే సినిమాల టెన్షన్ కి తోడు ఇప్పుడు ఆయనకు వెంట్రుకల సమస్య కూడా ఇబ్బందిగా మారింది.

ముందు హెయిర్ పాట్చింగ్...తర్వాతే సినిమాలు

ఈ సమస్యపై ఆయన ప్రముఖ వైద్యుడిని సంప్రదించగా హెయిర్ పాట్చింగ్ చేయాలని చెప్పాడని తెలుస్తోంది. దీంతో తేజ్ హెయిర్ పాట్చింగ్ చేయించుకోవడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటివరకు కొత్త సినిమాలకు సైన్ చేయని సాయిధరమ్ తేజ్, వెంట్రుకల సమస్య తీరాకనే కొత్తగా సినిమాలకు సైన్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. 2014లో పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో టాలీవుడ్ లోకి ఆరంగేత్రం చేసిన తేజ్ వరుస హిట్లతో మెగా కుటుంబం నుంచి వచ్చిన హీరోల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నా తర్వాత పరిస్థితులు తలకిందులయ్యాయి. ఇప్పటికైనా ఆయన దశ ఏమైనా తిరుగుతుందేమో చూడాలి.

Similar News