సాయి ధరమ్ తేజ్ మారిపోయాడట

Update: 2018-09-30 07:02 GMT

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చేసింది తక్కువ సినిమాలే ఐన దాదాపు అన్ని ఫ్లాపులే. దానికి తోడు మనవాడు వెయిట్ కూడా భారీగా పెరిగాడని అందు కోసం అమెరికాకి తన పర్సనల్ ట్రైనర్ దగ్గర మేక్ ఓవర్ ని మార్చుకునేందుకు వెళ్లాడని తెలిసిన విషయమే. మూడు నెలలు పాటు అక్కడే ఉన్నాడని.. నెక్స్ట్ చేసే సినిమాల్లో తన లుక్ కంప్లీట్ గా మారిపోనుంది అని తెలుస్తుంది.

లేటెస్ట్ గా, తాజా సమాచారం ప్రకారం తేజు కొన్ని రోజుల కిందటే అమెరికా నుండి హైదరాబాద్ తిరిగి వచ్చాడట. చాలా స్టైలిష్ మేకోవర్ తో కనిపించాడట. వెయిట్ తగ్గటమే కాదు చాలా ఫిట్ గా...కొత్త హెయిర్ స్టైల్ తో..డిఫరెంట్ బియర్డ్ లుక్ తో మెరిసిపోయాడట. చాలా కొత్తగా ఉన్నాడని తన దగ్గర స్నేహితులు చెబుతున్న మాట.

కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తేజు ఒక సినిమా చేయాల్సివుంది అది వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈసినిమాకు 'చిత్రలహరి' అనే టైటిల్ ను పెట్టనున్నారు. మరి ఈ కొత్త మేకోవర్ తో తేజు ఫ్లాపుల నుండి బయట పెడతాడేమో చూడాలి.

Similar News