సీనియర్లను ఫాలో అవుతున్న తేజూ

కెరీర్ స్టార్టింగ్ లో పర్లేదు అనిపించుకున్న సాయి ధరమ్ తేజ్ కు తరువాత వరుస డిజాస్టర్స్ రావడంతో ఇక తేజూ కెరీర్ అయిపోయినట్టే అనుకున్నారు అంతా. తేజూ [more]

Update: 2019-03-13 08:37 GMT

కెరీర్ స్టార్టింగ్ లో పర్లేదు అనిపించుకున్న సాయి ధరమ్ తేజ్ కు తరువాత వరుస డిజాస్టర్స్ రావడంతో ఇక తేజూ కెరీర్ అయిపోయినట్టే అనుకున్నారు అంతా. తేజూ సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి ప్రధాన కారణం తను ఎంచుకునే కథలు. స్టార్ డైరెక్టర్స్ తో చేసినా మంచి కథలు లేకపోవడంతో సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అందుకే తేజూ ఒక అడుగు ముందుకు వేసి సీనియర్ ఎన్టీఆర్, కృష్ణను ఫాలో అవ్వనున్నాడు. ఎన్టీఆర్, కృష్ణ తమ కథలు తామే రాసుకుని డైరెక్ట్ చేసి యాక్ట్ చేసేవారు.

తానే కథ రాసుకొని

అదే విధంగా తేజూ తానే కథలు రాసుకుని తానే యాక్ట్ చేయనున్నాడు. తేజూ ఒక సినిమా కోసం తనే స్వంతంగా ఓ కథ రాసుకున్నాడట. డైలాగ్ వర్షన్ లేకుండా కేవలం ఒక లైన్ ని డెవలప్ చేసుకుని దాని మీదే వర్క్ చేస్తూ ఫైనల్ గా ఓ కొలిక్కి తెచ్చాడట. ఈ దశగా తేజూ ఆల్రెడీ ఓ యంగ్ డైరెక్టర్ తో చర్చలు కూడా జరిపినట్టు వినికిడి. చిత్రలహరి తర్వాత ఈ కథతోనే సినిమా ఉన్నా ఆశ్చర్యం లేదు. మరి తేజూ ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూద్దాం.

Tags:    

Similar News