వీరిద్దరూ మళ్ళీ మళ్ళీ.. జోడి కడుతున్నారా?

Update: 2018-05-19 04:09 GMT

ఇప్పటివరకు మాస్ చిత్రాలవెంట పడి కెరీర్ లో బాగా దెబ్బ తిన్న మెగా హారో సాయి ధరమ్ తేజ్... లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ కరుణాకరన్ డైరెక్షన్ లో తేజ్ ఐ లవ్యూ అనే ప్రేమ కథా చిత్రంలో నటిస్తున్నాడు. మరి మాస్ అనే మూసలో కొట్టుకుపోతున్న సాయి ధరమ్ తేజ్ లవర్ బాయ్ అవతారం ఎత్తి ఈ సినిమా తో హిట్ కొట్టి మళ్ళీ నిలదొక్కుకోవాలని డిసైడ్ అయ్యాడు. అనుపమ పరమేశ్వరన్ తో కలిసి తేజ్ ఐ లవ్యూ లో నటిస్తున్నాడు. చక్కటి ట్రెడిషనల్ లుక్స్ తో అనుపమ ఇంతవరకు చేసిన సినిమా ల్లో బాగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఐ లవ్యూ లో కూడా సాయి ధరం అండ్ అనుపమాల మధ్య కెమిస్ట్రీ చాలా బాగుందని అంటున్నారు చిత్ర బృందం.

మరి ఆ సినిమాలో వారి మధ్యన ఎలాంటి కెమిస్ట్రీ ఉందో మనకు క్లారిటీ లేదుగాని... ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ పొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అయితే సాయి ధరమ్, అనుపమలు నటించిన తేజ్ ఐ లవ్యూ ఇంకా విడుదల కాకుండానే మళ్ళీ సాయి ధరం అనుపమలు కలిసి మరో సినిమాని ఒప్పుకున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఇప్పటికే సాయి, అనుపమ కలిసి నటించే సినిమా అగ్రిమెంట్ పనులు కూడా ప్రారంభమయ్యాయట. ఆన్ స్క్రీన్ పై వీరిద్దరి కెమిస్ట్రీ సూపర్బ్ గా ఉందని... దర్శకుడు కిషోర్ తిరుమల రీసెంట్ గా.. సాయి ధరం తేజ్- అనుపమ కాంబినేషన్ లో మూవీ తీసే విషయమై వీరిని సంప్రదించాడట.

అయితే కిషోర్ తిరుమల చెప్పిన స్టోరీ లైన్ నచ్చిన సాయి ధరం మరియు అనుపమ లు వెంటనే ఈ సినిమా చేసేందుకు అంగీకరించినట్లుగా తెలుస్తుంది. ఇక ఈసినిమాలో సాయి ధరమ్ కేరెక్టర్ తో పాటుగా అనుపమ పరమేశ్వరన్ కేరెక్టర్ కూడా కొత్తగా ఉంటుందని.. అందుకే వీరు వెంటనే ఈ ప్రాజెక్ట్ కి ఒకే చెప్పారని కూడా ప్రచారం జరుగుతుంది. మరి ఎంతగా నచ్చకపోతే... వీరిద్దరూ మళ్ళీ మళ్ళీ కలిసి నటించడానికి ఒప్పుకుంటారు.

Similar News