సునీల్ నే నమ్ముకున్న తేజు..!

ఐదు ఫ్లాప్స్ తో ఉన్న సాయి ధరమ్ తేజ్ డబుల్ హ్యాట్రిక్ కొడతాడా? లేదంటే హిట్ ని ఖాతాలో వేసుకుని ఫ్లాప్స్ పరంపరకు స్వస్తి చెబుతాడా? అనేది [more]

Update: 2019-03-27 11:12 GMT

ఐదు ఫ్లాప్స్ తో ఉన్న సాయి ధరమ్ తేజ్ డబుల్ హ్యాట్రిక్ కొడతాడా? లేదంటే హిట్ ని ఖాతాలో వేసుకుని ఫ్లాప్స్ పరంపరకు స్వస్తి చెబుతాడా? అనేది వచ్చే నెలలో విడుదల కాబోయే చిత్రలహరి సినిమానే డిసైడ్ చేస్తుంది. సాయి ధరమ్ కి ఎన్ని ఫ్లాప్స్ ఉన్నప్పటికీ చిత్రలహరి బిజినెస్ మాత్రం ఇప్పటికే క్లోజ్ అయ్యింది. దీంతో తేజు కాస్త హ్యాపీ అయ్యాడు. అయితే ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని తేజు బలంగా నమ్ముతున్నాడు. కారణం తన సినిమాలో సునీల్ నటిస్తుండడం. అలాగే చిత్రలహరి టీజర్ కి అనూహ్యమైన స్పందన ప్రేక్షకుల నుండి రావడం. హీరోగా చేతులెత్తేసి మళ్లీ కమేడియన్ వేషాలేస్తున్న సునీల్ చిత్రలహరి సినిమాకి మెయిన్ పిల్లర్ లా చిత్రలహరి ప్రమోషన్స్ లో చెబుతోంది చిత్రలహరి టీం. అందుకే తేజుతో పాటుగా అందరూ సునీల్ నే నమ్ముకున్నట్టుగా కనబడుతుంది ప్రస్తుతం టీం వ్యవహారం.

హిట్ పడాల్సిందే

చిత్రలహరి టీజర్ దగ్గర నుండి పోస్టర్, ఫొటోస్, ఫస్ట్ సింగల్ వరకు సునీల్ లేకుండా చితాలహరి ప్రమోషన్స్ లేవు. గతంలో సునీల్ కమెడియన్ గా చేసిన సినిమాలన్నీ పెద్ద హిట్స్. అందుకే దర్శకుడు కిషోర్ తిరుమల సునీల్ కి చిత్రలహరి కోసం ఒక ప్రత్యేకమైన కమెడియన్ పాత్రని రాసాడనిపిస్తుంది. మరి సునీల్ క్రేజ్ ఈ సినిమాకి ఎంతవరకు పని చేస్తుందో తెలియదు కానీ చిత్రలహరి ఫస్ట్ సింగల్ ని మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ అదరగొట్టేసాడు. మరి ఆ పాటతో సినిమా మీద బజ్ మరింతగా పెరిగింది. ఏప్రిల్ 12న విడుదల కాబోతున్న చిత్రలహరి సినిమా కచ్చితంగా హిట్ అవ్వాల్సిందే. లేదంటే సాయి ధరమ్ పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుంది.

Tags:    

Similar News