'సాహో'లో ప్రభాస్ విలన్ ఫస్ట్ లుక్ చూసేయండి.!

Update: 2018-05-21 09:02 GMT

దర్శకుడు రాజమౌళి 'బాహుబలి' సినిమాతో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ లో మరో కోణాన్ని చూపించాడు. ఈ సినిమాలో ప్రభాస్ నటనకు ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా ఫిదా అయిపోయారు. ఈ సినిమాలో ప్రభాస్ తన పాత్ర అమరేంద్ర బాహుబలికి ప్రాణం పోయటంతో తన నటనతో ఇండియా వైడ్ పాపులర్ అయ్యాడు. దీంతో ప్రభాస్ నెక్స్ట్ మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

నీల్ ఫస్ట్ లుక్ విడుదల...

యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్ లో ప్రభాస్ - శ్రద్ధా కపూర్ లు జంటగా తెరకెక్కుతోన్న సాహోపై ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'బాహుబలి' సినిమాతో తన మార్కెట్ పెంచుకున్న ప్రభాస్ 'సాహో' చిత్రంతో ఇండియా వైడ్ మార్కెట్ ను సంపాందించుకునేందుకు ఈ సినిమాలో బాలీవుడ్ విలక్షణ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ను ప్రభాస్ కు విలన్ గా ఎంపిక చేశాడు సుజీత్. లేటెస్ట్ గా విలన్ నీల్ ఫస్ట్ లుక్ విడుదలైంది.

ప్రభాస్ ను ఢికొట్టేలా...

విజయ్ 'కత్తి' సినిమాతో తెలుగు జనాలకు పరిచయమైన నీల్ నితిన్ ముఖేష్ గుబురుగడ్డంతో, పదునైన చూపులతో ఉన్న ఫస్ట్ లుక్ విడుదలైంది. ప్రస్తుతం దుబాయ్ లో ప్రభాస్ తో పాటు నీల్ పై కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ లుక్ తో సాహోపై అంచనాలు మరింత పెరిగాయని చెప్పవచ్చు. సాహోలో వారిద్దరు తలపడే సన్నివేశాలు సినిమాకే హైలైట్ అవుతాయని సినిమా టీం చెబుతున్నారు.

Similar News