ప్రభాస్ ‘జాన్’ అతలాకుతలం

సాహో దెబ్బకి ప్రభాస్ తాజా చిత్రం జాన్ సినిమా షూటింగ్ మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో అనేది ఎవ్వరికి అంటే చిత్ర బృందానికి కూడా క్లారిటీ ఉన్నట్టుగా అనిపించడం [more]

Update: 2019-12-31 11:39 GMT

సాహో దెబ్బకి ప్రభాస్ తాజా చిత్రం జాన్ సినిమా షూటింగ్ మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో అనేది ఎవ్వరికి అంటే చిత్ర బృందానికి కూడా క్లారిటీ ఉన్నట్టుగా అనిపించడం లేదు. సాహో సినిమా ప్లాప్ తో నిర్మాతలు జాన్ సినిమాకి బడ్జెట్ కుదించడం, అలాగే సినిమా స్క్రిప్ట్ లో కొద్దిగా మార్పులు చేర్పులు చెయ్యడం, మరీ హీరోయిజం మీద ఫోకస్ చేయకుండా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు.. ఇంకా ముందు అనుకున్న కొన్ని ఖ‌రీదైన ఎపిసోడ్లు తీసి ప‌క్క‌న పెట్టెయ్యడం, అలాగే ముందు అనుకున్న సెట్స్ విషయంలో చిత్ర బృందం వెనక్కి తగ్గడం, కాస్ట్లీ లొకేషన్స్ ని లిస్ట్ లో నుండి తీసెయ్యడం లాంటివి జరగడంతో.. జాన్ షెడ్యూల్ లేట్ అవుతూ వచ్చింది.

అయితే ఈ క్రిష్ట్మస్ తర్వాత జాన్ కొత్త షెడ్యూల్ మొదలవుతుంది అని అన్నారు. అలాగే కొత్త షెడ్యూల్ కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ఓ సెట్ లో మొదలుకాబోతుంది అని ప్రచారం జరిగింది. తాజాగా జాన్ షూటింగ్ మరోసారి వాయిదా వేశారని, ఇప్పటివరకు జరిగిన షెడ్యూల్ షూటింగ్ కూడా అనుకూలంగా ఉంటేనే ఉంచుతారని, లేదంటే ఆ సీన్స్ రీ షూట్స్ చెయ్యడం గ్యారెంటీ అని అంటున్నారు. ఇక తాజాగా జాన్ షూటింగ్ కొత్త షెడ్యూల్ సంక్రాంతి త‌ర‌వాతే అని.. జ‌న‌వ‌రి 17 నుంచి హైద‌రాబాద్‌లో కొత్త షెడ్యూల్ మొద‌లుకానుందని లేటెస్ట్ సమాచారం. ఇక సాహో దెబ్బకి బడ్జెట్ తగ్గించడం ఓకె గాని.. సినిమా లో క్వాలిటీ తగ్గించాల్సిన అవసరం ఏముంది. మళ్ళీ ఈ సినిమాతో ప్రభాస్ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా చూడండి అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ దర్శకనిర్మాతలకు రిక్వెస్టులు పెడుతున్నారు

Tags:    

Similar News