ప్రభాస్ కు ఎదురు దెబ్బ

Update: 2018-04-20 09:50 GMT

బాహుబలి సినిమాతో ప్రభాస్ ఇండియా వైడ్ క్రేజ్ సంపాందించుకున్న మాట నిజమే. అందుకే తన తర్వాత మూవీ కోసం నేషన్ మొత్తం ఎదురుచూస్తుంది. యంగ్ రెబెల్ స్టార్ నెక్స్ట్ మూవీస్ పై దేశవ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తోంది. అందుకే సాహో మూవీ విషయంలో నేషనల్ మీడియా కవరేజ్ ఉంటోంది.

బిజినెస్ పరంగా కూడా ప్రభాస్ కు ఇండియా వైడ్ మంచి మార్కెట్ ఉంది. సాహో హిందీ రైట్స్ ను క్లోజ్ చేసింది బాలీవుడ్ కు చెందిన టీ-సిరీస్ సంస్థ. మొదట ఈ మూవీ రైట్స్ కేవలం నార్త్ వరకే 300 కోట్ల రూపాయలకు అగ్రిమెంట్ కుదిరిందని అన్నారు. కానీ తర్వాత ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ హిందీ థియేట్రికల్ ప్లస్ శాటిలైట్ వరకూ కలిసి 120 కోట్లకు లెక్క తేలిందని అన్నారు. మల్లి ఇప్పుడు టీ-సిరీస్ తో సాహో హిందీ రైట్స్ డీల్ వాల్యూ 50 కోట్లు అన్నది లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్.

ఒక్కేసారి మరీ 300 నుంచి 50 వరకూ పడిపోవడం అంటే ఇదేదో అర్ధం కాని విషయమే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఉన్నట్టుండి ఒక్కేసారి ఇంతలా రేట్ పడిపోవడానికి కారణం ఏంటో అర్ధం కానీ విషయం.

Similar News