థమన్ బరస్ట్ అయ్యాడుగా

Update: 2018-09-30 07:11 GMT

టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ తర్వాత అంత పేరుంది ఒక్క థమన్ కే. స్టార్ హీరోలంతా తమ తమ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ లేదంటే... థమన్ అనే అంటారు. అయితే దేవిశ్రీ ప్రసాద్ కుటుంబ కథా చిత్రాలకు, ప్రేమ కథ చిత్రాలకు అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వగలదు. ఇక థమన్ మాస్ ఎంటర్టైన్మెంట్స్ కి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ఇరగదీసాడు. అయితే థమన్ మీద ఒక కంప్లైంట్ ఎప్పుడు తెగ హైలెట్ అవుతుంది. తాను మ్యూజిక్ అందిస్తున్న సినిమాల పాటలు బయటికొచ్చిన వెంటనే థమన్ ఆ సినిమా నుండి ఈ ట్యూన్ కాపీ కొట్టాడు. కాదు కాదు ఈ సినిమా నుండి కాపీ కొట్టాడు.. అదేమిటి తన పాటల నుండి తానే కాపీ కొట్టాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అందుకే థమన్ ని కాపీ క్యాట్ అంటూ ఆటపట్టిస్తుంటారు. తాజాగా థమన్ మ్యూజిక్ అందిస్తున్న అరవింద సమేత పాటలను కూడా వేరే వాటితో పోలిక పెట్టేసి థమన్ నువ్విక మారవా అంటూ సోషల్ మీడియా సాక్షిగా ఆడేసుకుంటున్నాడు.

అయితే ఎప్పుడు తన మీద వస్తున్న కామెంట్స్ ని లైట్ తీసుకునే థమన్ ఈసారి బరస్ట్ అయ్యాడు. థమన్ లేటెస్ట్ ఇంటర్వ్యూ లో తన కాపీ పాటల విషయంలో తన బాధను వెళ్లగక్కాడు. అయినా నా పాటను మళ్ళీ నేను వాడుకుంటే కాపీ అని ఎలా అంటారు అని తెలివిగా మాట్లాడిన థమన్ ఇంకా... ఓ రచయిత ఒక పాటలో ప్రేమ అని పదాన్ని రాస్తారు. మళ్ళీ ఇంకో పాటలో ప్రేమ’అని రాస్తే కాపీ అంటారా... ఇటువంటి విమర్శలపై ఐ డోంట్ కేర్. సోషల్ మీడియాలో ఎవరో ఏవో కామెంట్స్ చేస్తే పట్టించుకోను. వారికీ ఇంపార్టెన్స్ ఇస్తూ పొతే.. నాపని మీద నేను దృష్టి పెట్టలేనంటూ కామెంట్స్ చేసే వారిపై విరుచుకుపడ్డాడు.

ఇక బిజినెస్ మ్యాన్ లో ఒక పాటను థమన్ కాపీ కొట్టాడంటే.. అప్పట్లో ఆ సినిమా డైరెక్టర్ పూరి జగన్నాధ్ స్వయానా నేనే థమన్ కి ఆ సినిమా పాటను వేరే సినిమా మ్యూజిక్ నుండి తీసుకోమని చెప్పానని చెప్పినా... థమన్ మీద ఆ కామెంట్స్ కి ఫుల్ స్టాప్ పడలేదు. ఇక వాటన్నిటిని విన్న థమన్ పై విధంగా స్పందించాడు. ఇక మ్యూజిక్ విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టయిల్... తన స్టయిల్ తనదని.. మళ్ళీ మళ్ళీ విమర్శిస్తే నేనేం చేయను. నన్ను నేను డిఫెండ్ చేసుకోవడం కోసం ఏదో ఒకటి మాట్లాడను. కామెంట్ చేయడం వాళ్ళ బతుకు అనుకుంటే బతకనివ్వండి. హ్యాపీగా కామెంట్ చేసుకోమనండి. అంటూ తన కాపీ కంటెంట్ విషయంలో బరస్ట్ అయ్యాడు.

Similar News