‘జై బాలయ్య’ అని అరుస్తున్న ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ – బాలకృష్ణ మధ్య మనస్పర్దలు ఉన్నాయని, అందుకే ఒకరి ఫంక్షన్ కి ఒకరు రావడంలేదని, ఇదివరకు లాగా ఇప్పుడు లేరని కొన్ని రోజులు వరకు [more]

Update: 2018-12-31 03:01 GMT

జూనియర్ ఎన్టీఆర్ – బాలకృష్ణ మధ్య మనస్పర్దలు ఉన్నాయని, అందుకే ఒకరి ఫంక్షన్ కి ఒకరు రావడంలేదని, ఇదివరకు లాగా ఇప్పుడు లేరని కొన్ని రోజులు వరకు చాలానే ప్రచారం జరిగింది. హరికృష్ణ అకాల మరణంతో నందమూరి ఫ్యామిలీ మొత్తం ఒక్కటి అయింది. సీఎం చంద్రబాబు నాయుడు దగ్గరుండి అంత్యక్రియల ఏర్పాట్లు చూసుకున్నారు. బాలకృష్ణ అయితే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ల పక్కనే ఉండి వారిని ఓదారుస్తూ వచ్చాడు. ఈనేపధ్యంలో ‘అరవింద సమేత’ సక్సెస్ మీట్ కు ఎన్టీఆర్ బాలయ్య ను చీఫ్ గెస్ట్ గా పిలిచాడు. బాలయ్య దానికి వెళ్ళాడు.

‘ఎన్టీఆర్’ బయోపిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ని పిలిచాడు. ఎన్టీఆర్ కూడా వెళ్ళాడు. దాంతో ఫ్యామిలీ మొత్తం ఒకటైయ్యారు. పదే పదే కలుస్తూనే వస్తున్నారు వీరు. రీసెంట్ గా రాజమౌళి తనయుడు కార్తికేయ వివాహం రాజస్థాన్ లోని జైపూర్ కోటలో జరిగిన విషయం తెల్సిందే. ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ తో పాటు టాలీవుడ్ నుండి చాలామంది సెలెబ్రెటీస్ వెళ్లిన సంగతి తెలిసిందే. సెలెబ్రెటీస్ అంత ఒక చోటే చేరి డాన్స్ వేసి ఎంజాయ్ చేస్తున్న వీడియోస్ ఒకొకటి బయటికి వచ్చి వైరల్ అవుతున్నాయి.

అయితే అందులో ఓ వీడియో లో ఎన్టీఆర్ వెనక నుండి కొంతమంది జై బాలయ్య అని అరిస్తే ఎన్టీఆర్ కూడా జై బాలయ్య అంటూ గట్టిగా నినదిస్తు సరదాగా అరిచాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది. ఈ వీడియో ను చూసిన నందమూరి ఫ్యాన్స్ మాత్రం చాలా సంతోషంగా ఆ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.

Tags:    

Similar News