ఉండుండి పాయల్ ఇలా చేసిందేమిటి

Update: 2018-12-19 02:47 GMT

RX 100 తో ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకున్న పాయల్ రాజపుట్... సోషల్ మీడియాలో హంగామా చేస్తుంది కానీ... సినిమాల విషయంలో మాత్రం పాప బాగా సైలెంట్ అయ్యింది. RX 100 లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టిన ఈ గ్లామర్ భామ.. ఈసారి బాగా గ్లామర్ అండ్ నటనకు అవకాశం అంటే హీరోయిన్ గా తనని ఒక మెట్టు ఎక్కించే సినిమాల కోసం బాగా ఎదురు చూసింది. ఈలోపు సోషల్ మీడియాలో హాట్ హాట్ షూట్స్ తో పిచ్చెక్కిస్తుంది. తాజాగా రవితేజ - వి ఐ ఆనంద్ సినిమాలో ఒక హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. అయితే ఆ సినిమాలో పాయల్ పాత్రకి ఎంత ప్రాధాన్యత ఉందొ అందుకే ఒప్పేసుకుందనుకున్నారు అంతా.

అయితే రవితేజ సినిమాలో పాయల్ రాజపుట్ చెయ్యబోయే పాత్ర గురించి వింటే ముందు ఆశ్చర్యపోయి.. తర్వాత మాత్రం.. ఏంటి ఈ అమ్మాయి ఉండి ఉండి ఇలాంటి పాత్రని ఓకె చేసింది అని అనక మానరు. కానీ పాయల్ రాజపుట్ మాత్రం ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ కోసం ఇంతవరకు వెయిట్ చేసింది అన్నట్టుగా చెబుతుంది. ఇంతకీ వి ఐ ఆనంద్ - రవితేజ సినిమాలో పాయల్ చెయ్యబోయే పాత్ర ఏమిటంటే... అంధురాలిగా (కళ్ళు లేని,) చెవిటి తనంతో బాధపడుతున్న క్యారెక్టర్ లో నటిస్తోందట. మరి వి ఐ ఆనంద్ కథకు తగ్గ పాత్రని పాయల్ కిచ్చాడట. ఈ కథలో కీలకమైన ఈ పాత్రని ఇలా అంధురాలిగా.... చెవిటి అమ్మాయిగా డిజైన్ చేసాడట ఆనంద్.

ఇక డిస్కో రాజా టైటిల్ గా వాడుకలో ఉన్న ఈ సినిమాలో అలా అంధురాలు, చెవిటి అమ్మాయిలా కనిపించడానికి పాయల్ రాజపుట్ ఇప్పటినుండే బాగా కష్టపడుతుందట. ఈ పాత్రని ఛాలెంజ్ గా తీసుకుని చెయ్యాలని.. ఇలా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చెయ్యడానికి తానెప్పుడూ సై అంటుందట పాయల్. మరి సోషల్ మీడియాలో పాయల్ రాజపుట్ హాట్ హాట్ ఫోజులు చూస్తే.. ఏ సినిమాలోనైనా పాయల్ అందాలు ఆరబోసి.. గ్లామర్ తో చంపేస్తుంది అనుకుంటే ఇలా ఒక ఛాలెంజింగ్ కేరెక్టర్ కి ఓకె చెప్పి శెభాష్ అనిపించింది.

Similar News