RX100 పాప ఎన్టీఆర్ బయో పిక్ లోనా?

Update: 2018-11-26 05:21 GMT

ఎన్టీఆర్ బయోపిక్ లో టాలీవుడ్ నట దిగ్గజాలు చాలామంది నటిస్తున్నారు. ఎన్టీఆర్ తో అతి సన్నిహిత సంబంధాలు కలిగిన నటులతో పాటుగా... ఆయన నట జీవితంలో భాగమైన అనేకమందిని దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడులో చూపించబోతున్నాడు. ఇప్పటికే టాలీవుడ్ టాప్ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, నిత్యా మీనన్, సుమంత్, రానా ఇలా చాలామంది నటిస్తున్న ఈ సినిమాలో ఇప్పుడు RX100 బ్యూటీ పాయల్ రాజ్ ఫుట్ కూడా నటించబోతుంది. RX100 తర్వాత రవితేజ - వి ఐ ఆనంద్ సినిమా కి కమిట్ అయిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లో పార్ట్ అవ్వబోతుంది.

పాయల్ రాజపుట్ ఎన్టీఆర్ బయో పిక్ లో సహజనటిగా పేరు తెచ్చుకున్న జయసుధ పాత్రలో కనిపించబోతుంది. ఎన్టీఆర్ నట జీవితంలో డ్రైవర్ రాముడు , గజదొంగ , మహా పురుషుడు వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో జయసుధ ఎన్టీఆర్ కి జోడిగా నటించింది. అందుకే ఈ సినిమాలో జయసుధ పాత్రని కూడా హైలెట్ చేయబోతున్నాడట క్రిష్. ఇక ఆ పాత్ర కోసం పాయల్ రాజపుట్ ని తీసుకుంటున్నాడట క్రిష్. అయితే ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు జనవరి 9 న సంక్రాతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుంటే.... ఎన్టీఆర్ మహానాయకుడు మాత్రం జనవరి 24 విడుదల కష్టమంటూ వార్తలొస్తున్నాయి.

Similar News