ఆర్ఎక్స్ 100 హీరోయిన్ కు నిర్మాత వేధింపులు

Update: 2018-08-20 11:09 GMT

ఇటీవల చిన్న సినిమాగా విడుదలైన ఆర్ఎక్స్ 100 ఎంత భారీ విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ చిత్రంలో నటించిన హీరోహీరోయిన్లు, డైరెక్టర్ కు మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా నెగటీవ్ రోల్ లో మెప్పించిన పంజాబీ బామ పాయల్ రాజ్ పుత్ కు ఆమె ఆశించినట్లుగా అవకాశాలు బాగానే వస్తున్నాయి. అయితే, ఇటీవల అవకాశం ఇస్తానని ఆమెను పిలిచిన ఓ నిర్మాత... అవకాశం ఇవ్వాలంటే.. తనకు కావాల్సింది ఇవ్వాలని అడిగాడు. తనతో రాజీ పడాలని, మంచి అవకాశం ఇస్తానని ఆశచూపాడు. దీంతో పాయల్ రాజ్ పుత్ గట్టిగానే బుద్ధిచెప్పి వచ్చేసింది. తను పాత్ర లేకున్నా సరే కానీ ఇటువంటి నీచమైన పనులు మాత్రం చేయను అని తేల్చి చెప్పింది. తాను ప్రతిభను నమ్ముకుని చిత్ర పరిశ్రమకు వచ్చానని... ఇలాంటి పనులు చేయడానికి కాదని కరాఖండిగా చెప్పేసింది. తనకు ఎదురైన ఈ క్యాస్టింగ్ కౌచ్ వేదింపులపై పాయల్ రాజ్ పుత్ మీడియా సమావేశంలో స్వయంగా వెల్లడించింది.

Similar News