కేరెక్టర్ ఒకే.. కానీ

బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజపుట్ వెంకిమామ తో సేఫ్ అయినప్పటికీ… తన మీదున్న బోల్డ్ ముద్ర చెరుపుకోవడానికి పెద్దగా తాపత్రయ పడుతున్నట్టుగా లేదు. గ్లామర్ షో కి [more]

Update: 2020-01-25 07:24 GMT

బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజపుట్ వెంకిమామ తో సేఫ్ అయినప్పటికీ… తన మీదున్న బోల్డ్ ముద్ర చెరుపుకోవడానికి పెద్దగా తాపత్రయ పడుతున్నట్టుగా లేదు. గ్లామర్ షో కి ఎప్పుడు సై అనేలా కనబడుతున్న పాయల్ రాజ్ ఫుట్.. రవితేజ తో కలిసి డిస్కో రాజా లో నటించింది. ఈ సినిమాలో పాయల్ రాజ్ ఫుట్ చెవుడు..మూగ కేరెక్టర్ లో నటించింది. అయితే ఈ సినిమాలో పాయల్ రాజపుట్ గత సినిమాలతో పోలిస్తే బాగా కనిపించిందనే చెప్పాలి. కాకపోతే దర్శకుడు ఆమెకి నటించే స్కోప్ ఎక్కువ ఇవ్వలేదు. లేదంటే అభినయంతో పాయల్ రాజపుట్ ఈ సినిమాలో ఆకట్టుకోవడం ఖాయంగా కనబడేది.

అసలు కథ ని పక్కనబెట్టి రవితేజ ని ఎలివేట్ చెయ్యడంలోనే దర్శకుడికి సగం సినిమా సరిపోయింది. హీరోయిన్స్ పాత్రలను దారుణంగా తేల్చేసాడు. ముగురు హీరోయిన్స్ లో ఉన్నంతలో పాయల్ రాజపుట్ కేరెక్టర్ కాస్త బెటర్ గా అనిపిస్తుంది. అయితే ఇలా చిన్న చిన్న రోల్స్ కి పరిమితమై సినిమాలు ఒప్పుకోవడం ఎంతవరకు కరెక్టో పాయల్ కే తెలియాలి. లేదంటే ఆ బోల్డ్ పాత్రలే ఆమెకి గతేయ్యలా కనబడుతుంది. ఎందుకంటే పాయల్ రాజ్ ఫుట్ హైట్, ఆమె గ్లామర్ కి సీనియర్ హీరోలు తప్ప మరే హీరోలు ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదు. కాకపోతే చిన్న చిన్న పాత్రలకు, ప్రాధాన్యం లేని పాత్రలకు టెంప్ట్ అవ్వకుండా కాస్త నిడివి ఎక్కువ, ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఒప్పుకుంటే బెటర్. ఇక డిస్కో రాజా గనక హిట్ అయితే.. పాయల్ కి కాస్తో కూస్తో పేరొచ్చేది.. ఇక ఇప్పుడు ఆ సినిమాకొచ్చిన టాక్ వలన పాయల్ కి పేరు రావడం అటుంచి.. పాయల్ ని ఎవరూ పట్టించుకోరనిపిస్తుంది.

Tags:    

Similar News