‘ఆర్ఎక్స్ 100’ డైరెక్టర్ రియల్ లైఫ్ లో కూడా సక్సెస్ అయ్యాడు

Update: 2018-08-12 15:25 GMT

టాలీవుడ్ లో రీసెంట్ గా విడుదల అయ్యి ఆ సినిమాలో పని చేసిన అందరి జీవితాలు మార్చేసిన చిత్రం ‘ఆర్ఎక్స్ 100’. తక్కువ బడ్జెట్ తో.. పెద్దగా పేరు లేని నటీనటులతో తీసినా టాలీవుడ్ లో సెన్సషన్స్ క్రియేట్ చేస్తుంది. ఈ నిర్మాతలే కాదు.. దీన్ని కొన్న బయర్స్ కూడా ఆల్రెడీ ప్రాఫిట్ లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ భారీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈమూవీ డైరెక్టర్ అజయ్ భూపతికు టాలీవుడ్ నుండి బాలీవుడ్ నుండి ఆఫర్లు వస్తున్నాయి.

'ఆర్ఎక్స్ 100' సినిమా కారణంగానే అజయ్ పెళ్లి కన్ఫామ్ అయిందట. ఈ విషయాన్నీ స్వయంగా అజయ్ చెప్పారు. లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన ఈ విషయాల గురించి చెప్పుకొచ్చారు. అతను తన చిన్ననాటి స్నేహితురాలు శిరీషను ఈ నెల 25న పెళ్లి చేసుకోబోతున్నట్లు అజయ్ చెప్పాడు. మేమిద్దరం గత రెండేళ్ల నుండి లవ్ చేసుకుంటున్నాం అని కానీ ఆ అమ్మాయి తమ పెళ్లి గురించి వాళ్ల ఇంట్లో చెప్పితే ఉద్యోగం, ఆదాయం లేని కారణంగా వాళ్ల ఇంట్లో పెళ్ళికి అంగీకరించలేదని వెల్లడించాడు.

దాంతో తనకు రెండేళ్లు సమయం కావాలని శిరీష ఇంటి సభ్యుల్ని కోరానని అజయ్ తెలిపాడు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మారతానని తనకు నమ్మకం ఉందని వాళ్లకి మాటిచ్చాననీ చెప్పాడు. 'ఆర్ఎక్స్ 100 ' ట్రైలర్ రిలీజ్ కాగానే తనపై శిరీష ఇంటిలో నమ్మకం వచ్చిందని..సినిమా సక్సెస్ కాగానే తనపై పూర్తి నమ్మకం వచ్చి మా పెళ్లి ఓకే చెప్పారని సంతోషం వ్యక్తం చేశాడు. తమ మ్యారేజ్ హైదరాబాద్ లోనే జరుగుతుందని ఆయన తెలిపారు.

Similar News