కార్తికేయ ఏంటి మాకు ఇది?

హీరోయిన్స్ సినిమాల్లో ఎక్సపోజింగ్ చేసిన పర్లేదు చూడొచ్చు. కానీ ఈమధ్య ఏ సినిమా చూసిన మన హీరోలు షర్ట్ విప్పి సిక్స్ ప్యాక్ చూపిస్తున్నారు. సిక్స్ ప్యాక్ [more]

Update: 2019-08-03 08:44 GMT

హీరోయిన్స్ సినిమాల్లో ఎక్సపోజింగ్ చేసిన పర్లేదు చూడొచ్చు. కానీ ఈమధ్య ఏ సినిమా చూసిన మన హీరోలు షర్ట్ విప్పి సిక్స్ ప్యాక్ చూపిస్తున్నారు. సిక్స్ ప్యాక్ అనేది కథ డిమాండ్ చేసినప్పుడో లేదా ఏదన్న ఫైట్ సీన్ లో విప్పితే బాగుంటది. జనాలు కూడా దాన్ని యాక్సప్ట్ చేస్తారు. కానీ అదేవిధంగా బాడీ ఉంది కదా అని చూపించకూడదు. పట్టుమని రెండు మూడు సినిమాలు కూడా చేయలేదు కార్తికేయ తను నటించే ప్రతి మూవీలోనూ ఏదో ఒక సందర్భంలోనూ షర్ట్ ని విప్పుతూనే ఉన్నాడు.

తన మొదటి సినిమా RX 100 లో షర్ట్ విప్పితే మనం చూసాం. దానికి కారణం కథ డిమాండ్ చేసింది కాబట్టి. కానీ కార్తికేయ లేటెస్ట్ మూవీ గుణ 369 నిన్ననే రిలీజ్ అయింది. ఇందులో మనోడు ఏకంగా నాలుగైదు సార్లు షర్ట్ విప్పే ప్రోగ్రాం పెట్టడం అసలు ట్విస్ట్. నిజానికి అన్ని సార్లు షర్ట్ విప్పాల్సిన అవసరం లేదు. కానీ పదేపదే షర్ట్ విప్పాడు. చూసే వాళ్లకి కూడా చిరాకు వచ్చింది.ఇలా పదే పదే చొక్కా విప్పడం సెంటిమెంట్ అనుకుంటే మాత్రం దానికి ఇక చెక్ పెట్టేయడం బెటర్. ప్రస్తుతం సిక్స్ ప్యాక్ కి క్రేజ్ లేదు కూడ.

Tags:    

Similar News