ఆర్ఎక్స్100 ఒక్క రోజు గ్రాస్ నూ అందుకోలేని మెగా హీరో..!

Update: 2018-07-13 08:03 GMT

ఈ ఏడాది టాలీవుడ్ కి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. రిలీజ్ అయిన సినిమాల సక్సెస్ రేట్ కూడా బాగుంది. అదే విధంగా ఎటువంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా నిన్న రిలీజ్ అయిన ఆర్ఎక్స్100 చిత్రం ఊహించని స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. ట్రైలర్ తో ప్రేక్షకులని ఈ సినిమాకి వచ్చేలా చేశారు మేకర్స్. సినిమా మీద నమ్మకంతో భారీగా రిలీజ్ చేసారు.

హౌజ్ ఫుల్ బోర్డులు...

ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా వచ్చి భారీగా కలెక్ట్ చేస్తోంది ఈ చిత్రం. పలు సెంటర్స్ హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమివ్వడం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా ఈ సినిమా మొదటి రోజు గ్రాస్ రీసెంట్ గా రిలీజ్ అయిన తేజ్ ఐ లవ్ యూ సినిమా ఒక వారానికి కూడా అందుకోకపోవడం గమనార్హం. పాపం ఈ మధ్య ఈ మెగా హీరో ఏ సినిమా చేసిన అది బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడుతోంది. వరస ఫ్లాప్స్ తో సతమతం అవుతున్న టైంలో తేజ్ ఐ లవ్ యు కూడా డిజాస్టర్ గా నిలిచింది.

ఒక్కరోజులోనే భారీ కలెక్షన్లు

ఈ మెగా హీరో వారంలో అందుకున్న కలెక్షన్స్ ని ఆర్ఎక్స్100 ఒక్కరోజులోనే అందుకోవడం చర్చనీయాంశంగా మారింది. కలెక్షన్స్ అన్ని ఏరియాల్లో గట్టిగానే వస్తున్నట్లు సమాచారం అందుతోంది. కొత్త దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం అందించిన ఈ చిత్రం ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Similar News