సూపర్ హిట్ ఇచ్చినా ఖాళీగా ఉన్నాడు..!

ఆర్ఎక్స్ 100 సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి ఇంకా తన తరువాతి సినిమాని ఫైనల్ చేయలేదు. ఏదో ఒక హీరోతో సినిమా చేద్దామని [more]

Update: 2019-03-18 08:55 GMT

ఆర్ఎక్స్ 100 సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి ఇంకా తన తరువాతి సినిమాని ఫైనల్ చేయలేదు. ఏదో ఒక హీరోతో సినిమా చేద్దామని సెట్స్ వెళదాం అంటే బ్రేక్ పడుతుంది. ఆర్ఎక్స్ 100 తరువాత అజయ్ కి రెండు మూడు సంస్థల నుండి ఆఫర్స్ వచ్చాయి. వాటిల్లో భవ్య మూవీస్, హీరో రామ్, హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తదితర పేర్లు వినిపించాయి. అయితే రామ్ తో సినిమా క్యాన్సిల్ అయింది.

హిట్ చిత్రం అందించినా…

బెల్లంకొండతో సినిమా చేస్తాడు అని ప్రచారం జరిగింది కానీ అది కూడా జరిగే సూచనలు కనిపించట్లేదు. ప్రస్తుతం శ్రీనివాస్.. రమేష్ వర్మ, మరో కొత్త డైరక్టర్ లతో వేరే ప్రాజెక్టులు చేస్తున్నాడు. సో ఈ కాంబినేషన్ లో సినిమా కూడా క్యాన్సిల్ అయిందని విశ్వసనీయ వర్గాల బోగట్టా. అంటే ప్రస్తుతం అజయ్ ఖాళీ. ఒక సూపర్ హిట్ చిత్రం అందించి కూడా అజయ్ ఖాళీగా ఉన్నాడంటే ఎక్కడ తప్పు జరుగుతుంది?

Tags:    

Similar News