అజయ్ కు ఇలా చెయ్యిస్తున్నారేంటి..?

ఒకే ఒక్క సినిమాతో యూత్ మొత్తాన్ని పడేసిన అజయ్ భూపతి నెక్స్ట్ సినిమా విషయంలో ఎడతెగని సస్పెన్స్ క్రియేట్ అయ్యింది. ఆర్ఎక్స్ 100 అంటూ కుర్రకారుని మెస్మరైజ్ [more]

Update: 2019-05-01 06:20 GMT

ఒకే ఒక్క సినిమాతో యూత్ మొత్తాన్ని పడేసిన అజయ్ భూపతి నెక్స్ట్ సినిమా విషయంలో ఎడతెగని సస్పెన్స్ క్రియేట్ అయ్యింది. ఆర్ఎక్స్ 100 అంటూ కుర్రకారుని మెస్మరైజ్ చేసిన అజయ్ భూపతి నుండి మళ్లీ ఎలాంటి సినిమా బయటికి వస్తుందో అని అంతా ఎదురు చూస్తున్నారు. ఈలోపు నితిన్ తో అజయ్ భూపతి సినిమా అంటూ వార్తలొచ్చినా పారితోషకాల విషయంలో ఇబ్బందులు వచ్చి ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇక తర్వాత రిచ్చెస్ట్ హీరో అయిన బెల్లంకొండ శ్రీనివాస్ తో అజయ్ భూపతి తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడని.. టైటిల్ గా ‘మహాసముద్రం’ అని పెట్టారని.. శ్రీనివాస్ సరసన నటించేందుకు అక్కినేని సమంతని సంప్రదిస్తున్నారనే వార్తలొచ్చాయి. అయితే బెల్లంకొండతో కూడా అజయ్ అడ్జెస్ట్ కాలేక రీసెంట్ గా అక్కినేని కాంపౌండ్ లోకి అడుగుపెట్టి నాగ చైతన్యతో ఆ మహాసముద్రం సినిమాని పట్టాలెక్కించబోతున్నాడనే న్యూస్ మొదలైంది.

నాగచైతన్య బిజీగా ఉండటంతో…

చైతు, నాగ్ ని కలిసి అజయ్ భూపతి మహాసముద్రం కథ వినిపించాడని తెలుస్తోంది. టైటిల్ లో మహా అనేది హీరోయిన్ పేరని, సినిమా కథ మొత్తం హీరోయిన్ చుట్టూనే తిరుగుతుందని.. అలాంటి బలమైన క్యారెక్టర్ సమంత చేస్తే బాగుంటుందని అజయ్ భూపతి చైతుకి జోడిగా సమంతనే ఎంపిక చేయబోతున్నాడనే న్యూస్ నడిచింది. తాజాగా అజయ్ – చైతు ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ లేదంటూ ఒక వార్త చక్కర్లు కొడుతోంది. నాగ చైతన్య ఇప్పటికే వెంకిమామ ప్రాజెక్ట్ లో బిజీగా ఉండడం… తర్వాత మేర్లపాక డైరెక్షన్ లో మరో సినిమా, తర్వాత దిల్ రాజు నిర్మాణంలో మరో మూవీ.. ఇలా చైతు డైరీ మరో రెండేళ్లు ఫుల్ గా ఉండడంతో అజయ్ తో చైతు ఇప్పట్లో సినిమా చేసే అవకాశం లేదంటున్నారు. మరి నితిన్, బెల్లంకొండ శ్రీనివాస్, ఇప్పుడు చైతు కూడా అజయ్ హ్యాండ్ నుండి జారిపోయాడనే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో హల్ చల్ చేస్తుంది.

Tags:    

Similar News