ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ ఖాళీనేనా..!

ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లో ఒక్కసారిగా పేరు మార్మోగిన దర్శకుడు అజయ్ భూపతి. రెండేళ్ల క్రితం అర్జున్ రెడ్డితో సందీప్ రెడ్డి వంగా ఎంతటి సెన్సేషన్ [more]

Update: 2019-04-18 06:15 GMT

ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లో ఒక్కసారిగా పేరు మార్మోగిన దర్శకుడు అజయ్ భూపతి. రెండేళ్ల క్రితం అర్జున్ రెడ్డితో సందీప్ రెడ్డి వంగా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసాడో… గత ఏడాది ఆర్ఎక్స్100తో అజయ్ భూపతి కూడా అంతే సెన్సేషన్ క్రియేట్ చేసాడు. కార్తికేయ హీరోగా పాయల్ రాజపుట్ హీరోయిన్ గా అజయ్ భూపతి చేసిన ఆర్ఎక్స్ 100 కాసులు కురిపించడమే కాదు సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా తర్వాత అజయ్ భూపతి రేంజ్ మారిపోతుందని.. యూత్ హీరోలంతా అజయ్ భూపతి వెనకాల పడ్డారనే న్యూస్ నడిచింది. అలాగే నితిన్, బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి హీరోలు అజయ్ తో సినిమాలు చేస్తున్నట్లుగా వార్తలొచ్చాయి. కానీ నితిన్ కి కథ నచ్చక డ్రాప్ అయితే బెల్లంకొండకి ఏమైందో అజయ్ భూపతి సినిమాని పక్కనపెట్టి వేర్వేరు సినిమాలతో బిజీ అయ్యాడు. బెల్లంకొండ శ్రీనివాస్ తో మహాసముద్రం అనే టైటిల్ తో అజయ్ సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ తాజాగా ఆ సినిమా ఆగిపోయింది.

అదే కథతో అక్కినేని హీరో వద్దకు

అయితే ఈసారి అజయ్ భూపతి.. అక్కినేని నాగ చైతన్యతో సినిమా కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బెల్లంకొండతో చెయ్యాలనుకున్న మహాసముద్రాన్నే నాగ చైతన్యకి కాస్త అటు ఇటు మార్చి చైతు ఇమేజ్ కి తగ్గట్టుగా కథను ప్రిపేర్ చేసి సినిమా చెయ్యాలని భావిస్తున్నాడట. మరి చైతుతో మహాసముద్రం కథతో సినిమా తియ్యాలని తలంపుతో అజయ్ భూపతి అక్కినేని కాంపౌండ్ లోకి ఆడుగెట్టినట్లుగా వార్తలొస్తున్నాయి. అయితే అజయ్ ఈ సినిమాని బెల్లంకొండ శ్రీనివాస్ తో చెయ్యాలి అనుకున్నప్పుడు.. హీరోయిన్ గా సమంతని సంప్రదించాలని అనుకున్నాడు. మరి ఇప్పుడు హీరయిన్ గా సమంతానే తీసుకుంటాడో లేదా మరో హీరోయిన్ ని ఎంపిక చేస్తాడో చూడాలి. చైతు -సామ్ లు ఈమధ్యనే మజిలీతో హిట్ అందుకున్నారు. మరి మళ్లీ వెంటనే ఇద్దరు కలిసి నటించాలి అంటే చైతు – సామ్ ఒప్పుకోవాలిగా..!

Tags:    

Similar News