బాక్సాఫిస్ వద్ద RX100 దూకుడు !

Update: 2018-07-16 08:46 GMT

కార్తీకేయ - పాయల్ రాజపుట్ జంటగా లోబడ్జెట్ మూవీగా తెరకెక్కిన RX 100 మూవీ సందడి టాలీవుడ్ లో మాములుగా లేదు. చిన్నగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా భారీగా...పెట్టిన పెట్టుబడిని మూడింతల లాభాలతో కలెక్షన్స్ కుమ్మేస్తుంది. విజేత సినిమా తో పాటుగా బాక్సాఫీసు వద్దకు దిగిన ఈ RX 100 మూవీ... విజేత ఫ్లాప్ టాక్ బాగా కలిసొచ్చింది. అలాగే ఆ తర్వాత రోజు విడుదలైన చినబాబు మూవీకి టాక్ బాగున్నా.. RX కలెక్షన్స్ సునామీలో చినబాబు కలెక్షన్స్ కొట్టుకుపోయాయి. మరి చాలా సింపుల్ గా వచ్చి కేవలం యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా తెరకెక్కిన ఈ సినిమా కి ఈ రేంజ్ లో కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ రావడం మాములు విషయం కాదు. అందుకే ఇప్పుడు ఇండస్ట్రీ చూపంతా ఆ సినిమా డైరెక్టర్, నిర్మాత, హీరో, హీరోయిన్స్ మీద పడింది. అంతలా ఫిలిం సర్కిల్స్ లో RX 100 సినిమాపై హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా ఈ వీకెండ్ లో 5 కోట్లపై మేర కలెక్ట్ చేసి ఔరా అనిపించింది.

నైజాం 2.42

సీడెడ్ 60

ఉత్తరాంధ్ర 61

గుంటూరు 36

ఈస్ట్ గోదావరి 42

వెస్ట్ గోదావరి 32

కృష్ణా 35

నెల్లూరు 12

ఏపీ అండ్ టీఎస్ షేర్ 5.20 కోట్లు

Similar News