లవర్ కూడా దీన్ని ఆపలేకపోయింది..!

Update: 2018-07-23 08:08 GMT

రీసెంట్ గా టాలీవుడ్ లో 'రంగస్థలం' సినిమా రిలీజ్ అయ్యే ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో వేరే చెప్పనవసరం లేదు. తొలివారంలో కలెక్షన్స్ జోరు ఎలాగుందో..తర్వాత రెండు, మూడు వారాల్లో కూడా అదే జోరు కొనసాగింది. ఈ గ్యాప్ లో ఎన్ని సినిమాలు వచ్చిన వాటి ప్రభావం దీనిపై పడలేదు. పెద్ద సినిమా కాబట్టి అది అలా ఆడటంలో ఆశ్చర్యం లేదు.

దూసుకుపోతున్న ఆర్ఎక్స్ 100

అయితే ఇప్పుడు ‘ఆర్ఎక్స్ 100’ అనే చిన్న సినిమా కూడా ఇదే ఒరవడిని కొనసాగిస్తోంది. జులై 12 న విడుదల అయినా ఈ సినిమా వీకెండ్ తర్వాత కూడా మంచి వసూళ్లతో సాగి రెండో వీకెండ్లోనూ జోరు కొనసాగిస్తోంది. ఈ మధ్యలో రెండుమూడు సినిమాలు రిలీజ్ కాగా ఇవేవీ కూడా ‘ఆర్ఎక్స్ 100’ జోరును అడ్డుకోలేకపోయాయి. కానీ ఈ శుక్రవారం విడుదలైన కొత్త సినిమాలు కొంత ప్రభావం చూపించాయి.

కొత్త సినిమాలూ అడ్డుకోలేక...

'లవర్', ‘వైఫ్ ఆఫ్ రామ్’, ‘ఆటగదరా శివ’ ఈ మూడు సినిమాలు ఈ వారం రిలీజ్ కాగా సినిమాల టాక్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. అయితే 'లవర్' మార్నింగ్ షోకు చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ అది కూడా మార్నింగ్ షో వరకే. మ్యాట్నీ దగ్గర నుండి ‘ఆర్ఎక్స్ 100’ ఎప్పట్లాగే హవా సాగించింది. దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాత సినిమాకు ఓపెనింగ్స్ రాలేదంటే..‘ఆర్ఎక్స్ 100’ ప్రభావం యూత్ పైన అంతలా ఉంది. 'లవర్' తొలి రోజు కలెక్షన్స్ కంటే..‘ఆర్ఎక్స్ 100’ తొమ్మిదో రోజు వసూళ్లే ఎక్కువగా ఉన్నాయి. ఒక చిన్న సినిమాగా వచ్చి పెద్ద వండర్స్ ను క్రియేట్ చేస్తుంది ‘ఆర్ఎక్స్ 100’.

Similar News