ఈ సినిమాలో మసాలా ఎక్కువగా ఉన్నట్లుందే!

Update: 2018-07-11 07:49 GMT

కొన్ని సినిమాలు లోబడ్జెట్ తో తెరకెక్కినా... అందులో ఉన్న కంటెంట్ కి, మాసాలాకి యూత్ కనెక్ట్ అవుతారు. ఉదాహరణకి విజయ్ దేవరకొండ నటించిన 'అర్జునరెడ్డి' సినిమానే తీసుకోండి. ఆ సినిమా అసలెప్పుడు తెరకెక్కిందో కూడా ఎవ్వరికి తెలియదు.... ఆ సినిమా పోస్టర్స్ బయటికొచ్చేవరకు. అతా ఆ సినిమా పోస్టర్స్ బయటికొచ్చాయో లేదో.. యూత్ అటెంన్షన్ మొత్తం 'అర్జున్ రెడ్డి' పైన పడింది. ఎందుకంటే ఆ పోస్టర్స్ లో విజయ్ దేవరకొండ హీరోయిన్ షాలిని పాండేకి లిప్ కిస్ పెట్టడంతో... యూత్ లో ఆసక్తే కాదు... కొంతమంది ఆ సినిమాపై రచ్చ చెయ్యడానికి కారణమయ్యింది. అలాంటి లిప్ లాక్ కిస్ వలన యువత పెడదారి పడుతోందని.. మహిళా సంఘాలతో పాటుగా.... కాంగ్రెస్ నేత వీహెచ్ కూడా నానా రాద్ధాంతం చేశారు. ఇక విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' సినిమా ప్రమోషన్స్ లో చాలా ఎక్కువగా మాట్లాడి అందరి ఆగ్రహానికి గురయ్యాడు. కానీ సినిమా విడుదలయ్యాక సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. అందులో యూత్ కి కనెక్ట్ అయ్యే అంశాలు ఉన్నాయి కాబట్టి ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

 

హాట్ హాట్ సీన్లతో...

ఇప్పుడు కూడా అలాంటి సినిమా ఒకటి రేపు గురువారం థియేటర్స్ లోకి దిగబోతుంది. 'RX 100' అంటూ ఒక కొత్త కుర్రాడు కుర్రకారుని టార్గెట్ చేస్తున్నాడనిపిస్తుంది. కార్తికేయ హీరోగా అజయ్ భూపతి అనే డైరెక్టర్ ఈ సినిమా యూత్ ని టార్గెట్ చేస్తూ తెరక్కేకించినట్టుగా పోస్టర్స్ లో కనిపిస్తుంది. మరి ఈ సినిమా లో లిప్ కిస్ లు, హాట్ హాట్ సన్నివేశాలు, మసాలా సన్నివేశాలు చాలానే ఉన్నాయనిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ పాయల్ రాజపుట్ కూడా ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాలో నటించింది. అంటే కిస్సులకి, గ్లామర్ షో చెయ్యడానికి కూడా ఆమె వెనుకాడలేదని ఆ పోస్టర్స్ చూస్తుంటేనే అర్ధమవుతుంది.

ముందు విజయ్ వద్దకే...

మరి ఈ సినిమా కూడా 'అర్జునరెడ్డి' సినిమాలా సన్సేషన్ క్రియేట్ చేస్తుందేమో అనేది రేపు ఈపాటి కల్లా తేలిపోతుంది. ఎందుకంటే ఈ 'RX 100' సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇకపోతే ఈ సినిమా కథ విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రచారంలో ఉంది. అదేమిటంటే ఈ సినిమా కథ ముందుగా విజయ్ దేవరకొండ దగ్గరికే వచ్చిందట. కానీ ఒకసారి 'అర్జునరెడ్డి' లాంటి సినిమా చేశాక... మళ్లీ వెంటనే అలాంటి కథతో సినిమా చేస్తే ఇక అదే బ్రాండ్ తన మీద పడిపోతుందని... ఈ సినిమా చెయ్యనని చెప్పాడని.. కాదు కాదు.. విజయ్ బిజీ షెడ్యూల్ వల్ల ఈ సినిమా చెయ్యలేదని అన్నారు. మరి ఈ న్యూస్ ఈ సినిమా కలెక్షన్స్ కి ఏమన్నా పనికొస్తుందేమో తెలియాలన్నా కొద్ది గంటలు ఓపిక పట్టాల్సిందే.

Similar News