#RRRపై మళ్లీ మొదలైన పుకార్లు..!

#RRR పై వచ్చే రూమర్స్ అన్నింటికీ ప్రెస్ మీట్ లో సమాధానాలు చెప్పి రాజమౌళి పుల్ స్టాప్ పెట్టేసాడు. హీరోయిన్స్, కథ, టెక్నీషియన్స్, బడ్జెట్ గురించి చాలావరకు [more]

Update: 2019-04-11 07:00 GMT

#RRR పై వచ్చే రూమర్స్ అన్నింటికీ ప్రెస్ మీట్ లో సమాధానాలు చెప్పి రాజమౌళి పుల్ స్టాప్ పెట్టేసాడు. హీరోయిన్స్, కథ, టెక్నీషియన్స్, బడ్జెట్ గురించి చాలావరకు అనుమానాలకు క్లారిటీ ఇచ్చేసాడు. అప్పటివరకు హీరోయిన్స్ విషయంలో వచ్చిన రూమర్స్ రాజమౌళి క్లారిటీతో ఆగిపోయాయి. కానీ ఎన్టీఆర్ సరసన నటించాల్సిన హాలీవుడ్ హీరోయిన్ డైసీ వ్యక్తిగత కారణాలతో #RRR నుండి తప్పుకుంది. ఆ హీరోయిన్ క్రేజ్ సౌత్ లో, బాలీవడ్ లో ఏమాత్రం లేకపోవడంతో ఆమె తప్పుకున్నందునే ఎన్టీఆర్ ఫాన్స్ ఆనందపడ్డారు. రామ్ చరణ్ కి అందరికీ తెలిసిన అలియా భట్ ని తెచ్చిన రాజమౌళి ఎన్టీఆర్ కి ముక్కూమొహం తెలియని హీరోయిన్ ని తెచ్చాడనే ఫీలింగ్ కాస్తా ఆమె తప్పుకోవడంతో పోయింది.

ఈసారి బాలీవుడ్ భామ

ఇక తాజాగా #RRR లో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రకి సరిపోయే హీరోయిన్ కోసం మళ్లీ రాజమౌళి సెర్చింగ్ మొదలెట్టాడు. అయితే ఈసారి ఎన్టీఆర్ కు కూడా బాలీవుడ్ భామనే దింపే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లుగా ప్రస్తుత సమాచారం. రాజమౌళి ఎన్టీఆర్ కోసం సాహో బ్యూటీ శ్రద్ద కపూర్ లేదంటే శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కాపూర్ ని తేవాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి ఎన్టీఆర్ సరసన నటించబోయే భామ విషయం తేలేవరకు ఇంకెన్ని పేర్లు వినిపిస్తాయో చూద్దాం.

Tags:    

Similar News