నేను బావున్నానంటున్న పోసాని

సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ భయపడని.. ఎవరికీ దడవని వ్యక్తి పోసాని కృష్ణమురళి. తనేం అనుకున్నాడో దాన్ని నిర్భయంగా మాట్లాడడం పోసాని స్పెషలిటీ. అటు రాజకీయాల్లోనూ పోసాని కి [more]

Update: 2019-07-14 08:05 GMT

సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ భయపడని.. ఎవరికీ దడవని వ్యక్తి పోసాని కృష్ణమురళి. తనేం అనుకున్నాడో దాన్ని నిర్భయంగా మాట్లాడడం పోసాని స్పెషలిటీ. అటు రాజకీయాల్లోనూ పోసాని కి సపరేట్ స్టయిల్ ఉంటుంది. అందుకే పోసాని అంటే నచ్చని వాళ్లు అతనికి మెంటల్ అంటుంటారు కూడా.. అయితే ఈమధ్యన పోసాని కృష్ణ మురళి అనారోగ్యంతో హాస్పిటల్ పాలయ్యాడు. గత కొన్నేళ్లుగా కీళ్ల నొప్పుల సమస్యలతో బాధ పడుతున్న పోసాని కృష్ణమురళి…. ఈమధ్యనే యశోదా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న సంగతి తెలసిందే. అయితే యశోద హాస్పిటల్ లో చేసిన ఆపరేషన్ వికటించి.. పోసాని ఆరోగ్యం క్షీణించినట్లుగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

అయితే పోసాని ఆరోగ్యం విషయంలో వస్తున్న వార్తలపై ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది. స్వయానా పోసాని కృష్ణ మురళిని ఓ వీడియో బైట్ ద్వారా తన ఆరోగ్యంపై స్పందించాడు. తన ఆరోగ్యం పాడైందని వస్తున్న వార్తల్లో నిజం ఉందని.. కానీ యశోద హాస్పిటల్ డాక్టర్ తన వ్యాధిని నయం చేసి మళ్ళీ మనిషిని చేసారని.. ఇప్పుడు తన ఆరోగ్యం కుదుటపడిందని…. కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత తాను యధావిధిగా షూటింగ్ లో పాల్గొంటానని… తన ఆరోగ్యం కుదటపడాలని ప్రార్థించిన వారందరీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అని ఆ వీడియో ద్వారా తెలియజేసారు

Tags:    

Similar News