చి.ల.సౌ హీరోయిన్ లో మరో కోణం..!

Update: 2018-08-14 07:20 GMT

రెండు వారాల కిందట సుశాంత్ హీరోగా... రుహాని శర్మ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం 'చి.ల.సౌ'. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది కానీ ఆదే సమయంలో అడివి శేష్ 'గూఢచారి' ప్రభావం ఈ సినిమాపై పడి వసూళ్లు రాకుండా చేసింది. ఇక తన తొలి సినిమాను డైరెక్ట్ చేసిన రాహుల్ రవీంద్రన్ కు మంచి పేరు వచ్చింది. హీరోయిన్ రుహాని శర్మ గురించి.. తన నటన గురించి ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు.

హాట్ ఫోటోలు వదిలి...

ఈ సినిమాలో తను హోమ్లీగా కనిపించడమే కాదు చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో అందరి మనసులు దోచుకుంది. యూత్ ని ఆకట్టుకునే విషయంలో తనలోని గ్లామర్ ను హాట్ ఫోటోస్ రూపంలో బయటికి వదిలింది. పైన ఫోటో చూస్తే ఈమెలో ఇటువంటి సెక్సీ అప్పీల్ కూడా ఉందా అన్న అనుమానం రావడం సహజం. కథ డిమాండ్ చేస్తే స్కిన్ షోకు సైతం రెడీ అనేలా రుహాని శర్మ ఇచ్చిన ఫోజు చూస్తుంటే అలా ఉండిపోవాలంతే.

అవకాశాలు కొట్టేద్దామని...

పంజాబ్ కు చెందిన ఈ బామ్మా చేసింది మూడు సినిమాలే. ఒకటి తమిళ్..ఇంకోటి పంజాబీ..మరొకటి తెలుగులో. తెలుగు ప్రొడ్యూసర్స్ ను.. డైరెక్టర్స్ ను తనవైపు తిప్పుకునే ప్రయత్నం అయితే బాగానే చేస్తుంది. ఒకవేళ 'చి.ల.సౌ' రిజల్ట్ ఇంకా బాగా వస్తే ఆమెకు నెక్స్ట్ మూవీస్ ఛాన్స్ ఈజీ గా వచ్చేవి. అందుకేనేమో ఈ ఫొటోస్ ను సడన్ గా బయటకు వదిలి త్వరగా ఛాన్స్ కొట్టేయాలని చూస్తుందేమో. రీసెంట్ గా రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న 'ఆర్ఎక్స్ 100 ' హీరోయిన్ పాయల్ రాజపుత్ కూడా పంజాబీ కావడం విశేషం.

Similar News