#RRR మూవీపై ఇంట్రస్టింగ్ అప్ డేట్!

Update: 2018-10-14 11:56 GMT

#RRR ...Ramarao ( NTR ), Rajamouli , Ram Charan . వీరి కాంబినేషన్ ఓ క్రేజీ చిత్రం రానుందని విషయం తెలిసిందే. ప్రస్తుతం దానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ నెలలో ఇది సెట్స్ మీదకు వెళ్లే అవకాశంఉంది. ముందు ఎన్టీఆర్ తో షూట్ చేసి తర్వాత రామ్ చరణ్ పై షూట్ చేయనున్నాడు జక్కన్న. అందుకుగాను ఫిలిం సిటీ దగ్గరలో భారీ ఎత్తున ఓ సెట్ వేయనున్నారు.

ఇంటర్వెల్ సీక్వెన్స్.....

కానీ తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ - రామ్ చరణ్ ల పై రాజమౌళి ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ ప్లాన్ చేసాడు. రామ్ లక్ష్మణ్ లతో ఆ ఫైట్ కు సంబంధించి డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. 45 రోజులు పాటు ఈ ఫైట్ సీక్వెన్స్ ప్లాన్ చేసాడు జక్కన్న. అయితే మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఏంటంటే..కీరవాణితో కలిసి రాజమౌళి పాటలను ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాడు అంట. దానికి సంబంధించి చర్చలు జరుపుతున్నారు.

స్టోరీ లైన్ మాత్రం....

అయితే ఇప్పటివరకు ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటి అనేది బయటికి రాలేదు. కానీ సోషల్ మీడియాలో రకరకాలుగా స్టోరీస్ వినపడుతున్నాయి. ఈసినిమా సెట్స్ మీదకు వెళ్ళేలోపు పాటలు అన్నిటినీ సిద్ధం చేయాలనేది రాజమౌళి సంకల్పంగా తెలుస్తుంది.

Similar News