RRR టెస్ట్ షూట్ అందుకే ఆపేశాం!!

కరోనా లాక్ డౌన్ తో రాజమౌళి కూడా అందరిలాగే RRR సినిమా షూటింగ్ ఆపెసుకుని కూర్చున్నాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటుగా RRR నటులు, టెక్నీకల్ [more]

Update: 2020-07-27 05:43 GMT

కరోనా లాక్ డౌన్ తో రాజమౌళి కూడా అందరిలాగే RRR సినిమా షూటింగ్ ఆపెసుకుని కూర్చున్నాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటుగా RRR నటులు, టెక్నీకల్ సిబ్బంది మొత్తం ఇళ్ళకి పరిమితమయ్యారు. అయితే కరోనా ఉధృతి పెద్దగా లేని టైం లో ప్రభుత్వ అనుమతుల కోసం రాజమౌళి చిరు బృందం తో కలిసి కేసీఆర్ ని కలవడం అలాగే ఏపీ సీఎం జగన్ ని కలిసి షూటింగ్స్ అనుమతి కోరి.. చివరికి షూటింగ్ అనుమతులు తీసుకొచ్చారు. అయితే ప్రభుత్వాలు ముందు కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ.. టెస్ట్ షూట్ చేసిన తర్వాత షూటింగ్స్ మొదలు పెట్టమని చెప్పగా.. దానికి చిరు రాజమౌళి ని ఎంచుకుని రాజమౌళి RRR టెస్ట్ షూట్ చేసే బాధ్యతలు అప్పజెప్పాడు . అయితే రాజమౌళి కూడా అందుకు సిద్దమయ్యాడు. అన్ని రెడీ చేసుకున్నాక జులై లో టెస్ట్ షూట్ అనగా.. దానిని కూడా రాజమౌళి ఆపేసి ఫామ్ హౌస్ కి వెళ్లిపోయాయడు.

అయితే RRR టెస్ట్ షూట్ ఎందుకు ఆగిందో ఎవరికి అర్ధం కాకపోయిన.. కరోనా ఉధృతి వలెనే ఆగింది అని అందరూ ఫిక్స్ అయ్యారు. తాజాగా RRR కెమెరా మ్యాన్ సెంథిల్ కుమార్ కూడా RRR టెస్ట్ షూట్ ఎందుకు ఆగిందో చెబుతున్నాడు. కరోనా స్టార్ట్ అయ్యే టైం కి RRR టీం మొత్తం కరోనా జాగ్రత్తలు పాటించింది అని.. అందరూ మాస్క్ వేసుకుని శానిటైజ్ చేసుకుంటేనే సెట్ లోకి అనుమతిచ్చే వాళ్ళని, ఇక కరోనా లాక్ డౌన్ సమయానికి 70 శాతం RRR షూటింగ్ పూర్తయ్యింది అని చెప్పిన సెంథిల్ కుమార్ టెస్ట్ షూట్ ఆగింది కూడా కరోనా కి భయపడి అందులోని.. రోజుకి 500 నుండి 600 మందితో షూటింగ్ చేసే మేము కేవలం 40 నుండి 50 మంది షూటింగ్ చెయ్యడం పెద్ద సవాల్ అని భావించినా కూడా షూటింగ్ చెయ్యడానికి రెడీ అయ్యామని.. కానీ కరోనా ఉధృతి వలెనే టెస్ట్ షూట్ ఆపాల్సి వచ్చింది అని చెబుతున్నాడు.  

Tags:    

Similar News