సెకన్స్ తోనే సరిపెట్టుకోవాలా?

రాజమౌళి గత ఏడాది నుండి ఊరిస్తూ ఈ ఏడాది RRR సినిమా అప్ డేట్ ని మోషన్ పోస్టర్ ద్వారానే కాదు.. రామ్ చరణ్ పుట్టిన రోజుకి [more]

Update: 2020-04-20 06:23 GMT

రాజమౌళి గత ఏడాది నుండి ఊరిస్తూ ఈ ఏడాది RRR సినిమా అప్ డేట్ ని మోషన్ పోస్టర్ ద్వారానే కాదు.. రామ్ చరణ్ పుట్టిన రోజుకి రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు స్పెషల్ వీడియో ని వదిలాడు. RRR రామ్ చరణ్ స్పెషల్ వీడియో లో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ కూడా అదిరిపోయే లెవల్లో సూపర్ హిట్ అయ్యింది. అయితే రామ్ చరణ్ వీడియో ని ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో డబ్బింగ్ చెప్పించి.. అనుకున్న టైం కే వదిలిన రాజమౌళి.. ఎన్టీఆర్ బర్త్ డే కి కొమరం భీం స్పెషల్ వీడియో పై ఇప్పటికే వర్క్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా కరోనా లాక్ డౌన్ లో RRR ఎడిటింగ్ పనులు చేస్తున్నామని చెప్పాడు.

ఇక చరణ్ టీజర్ కావాల్సిన వర్క్ చాలా రోజుల క్రిందటే పూర్తి చేసాం గనక… లాక్ డౌన్ ఉన్నప్పటికీ ఆ వీడియో ని వదిలాం. కానీ ఎన్టీఆర్ టీజర్ అలా కాదు… ఇంకా కొన్ని ఎన్టీఆర్ షాట్స్ చిత్రీకరించాల్సి ఉంది. ప్రస్తుతం లాక్ డౌన్ నడుస్తుంది. ఆ సీన్స్ ఎలా షూట్ చెయ్యాలో అర్ధం కావడం లేదు అనేసరికి ఎన్టీఆర్ ఫాన్స్ లో అందోళన. రామ్ చరణ్ వీడియో సూపర్బ్ గా వచ్చింది.. దానికి పిచ్చ క్రేజ్ వచ్చింది.. కానీ ఎన్టీఆర్ టీజర్ విషయంలో రాజమౌళి మాటలకూ ఎన్టీఆర్ ఫాన్స్ టెంక్షన్ పడడమే కాదు.. ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మరి వాళ్ళు టెంక్షన్ పడడం లో అర్ధం ఉంది. లాక్ డౌన్ మే 3 తో ముగుస్తుందా? చెప్పలేం? ఒకేవేళ ముగిసినా షూటింగ్స్ కి అనుమతి అప్పుడే లభిస్తుందా? తెలియదు కానీ… ఎన్టీఆర్ టీజర్ లో అద్భుతాలు చూడడం కుదిరే పని కాదని ఫిక్స్ అవుతున్నారు చాలామంది. రాజమౌళి ఏదో ఒకటి చేసి ఎన్టీఆర్ టీజర్ వదిలినా.. అందులో ఎన్టీఆర్ ని ఎక్కువశాతం అంటే ఎక్కువ టైం చూపించడం కష్టం కనక ఎన్టీఆర్ స్పెషల్ వీడియో కొన్ని సెకన్స్ మాత్రమే ఉంటుంది అనే ఊహాగానాల్లో ఎన్టీఆర్ ఫాన్స్ కొట్టుమిట్టాడుతున్నారు.

Tags:    

Similar News