RRR లో ఓ రేంజ్ ఫైట్స్ ఉంటాయట?

రాజమౌళి ఏ సినిమా చేసినా యాక్షన్, మాస్ ప్రేక్షకులను ఓ ఊపు ఊపుతుంది. రాజమౌళి సినిమాల్లో యాక్షన్ సీక్వెన్సెస్ ఓ రేంజ్ లో ఉంటాయి. మాములుగా సినిమా [more]

Update: 2020-05-08 04:20 GMT

రాజమౌళి ఏ సినిమా చేసినా యాక్షన్, మాస్ ప్రేక్షకులను ఓ ఊపు ఊపుతుంది. రాజమౌళి సినిమాల్లో యాక్షన్ సీక్వెన్సెస్ ఓ రేంజ్ లో ఉంటాయి. మాములుగా సినిమా చేస్తేనే ఓ రేంజ్ ఫైట్స్ పెట్టె రాజమౌళి… పాన్ ఇండియా ఫిలిం బాహుబలి లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టాడు. బాహుబలి సినిమాలో కథ పరంగా ఎంత పేరొచ్చిందో… బాహుబలి యాక్షన్ సీన్స్ కి అంతే పేరొచ్చింది. ఇక తాజాగా RRR లోను రాజమౌళి కళ్ళు చెదిరే ఫైట్స్ పెట్టినట్లుగా టాక్ కాదు.. ప్రొఫెషనల్ బాక్సర్ కుల్దీప్ సింగ్ ట్విట్టర్ ద్వారా కన్ఫర్మ్ చేసాడు.

దర్శకుడు రాజమౌళితో వర్క్ చేస్తున్నందుకు గర్విస్తున్నా…. అజయ్ దేవగణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్ లు హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న RRR బాక్సింగ్ సీన్స్ కొరియోగ్రఫీ  చేశాను. ఈ సినిమా కూడా బాహుబలి లా ఓ రేంజ్ హిట్ అవడం గ్యారెంటీ అంటూ ట్వీట్ చేసాడు. మరి ఈ సినిమా పిరియాడికల్ మూవీ జోనర్ కాదేమో… కమర్షియల్ మూవీ గానే రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ వీడియో చూస్తే అనిపిస్తుంది. రామ్ చరణ్ పోలీస్ డ్రెస్ లో బాక్సింగ్, విలువిద్య  లాంటి స్పెషల్ ఎఫెక్ట్స్ విడుదల చేసిన వీడియో అందరిని ఆశ్చర్యపరిచింది. RRR యాక్షన్ సీన్స్ గూస్ బంబ్స్ వచ్చేలా ఉంటాయని… విల్లువిద్య, షూటింగ్, బాక్సింగ్ విద్యల్లో ఆరితేరిన సీతారామరాజు కోసం ఓ అదిరిపోయే బాక్సింగ్ ఫైట్ కంపోజ్ చేశారని… ఈ సన్నివేశాలన్నీ మెగా ఫ్యాన్స్‌‌కు ఓ స్పెషల్ ట్రీట్‌లా ఉంటుందని టాక్

Tags:    

Similar News