శ్ర‌ద్ధా కోసం #RRR కథ మారుస్తారా..?

హీరోస్ కోసం కథలు మారుస్తారు అని తెలుసు కానీ హీరోయిన్స్ కోసం కథలు మారుస్తారని ఈ రూమర్ వింటే అర్ధం అవుతుంది. రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న [more]

Update: 2019-04-20 08:25 GMT

హీరోస్ కోసం కథలు మారుస్తారు అని తెలుసు కానీ హీరోయిన్స్ కోసం కథలు మారుస్తారని ఈ రూమర్ వింటే అర్ధం అవుతుంది. రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్‌ నటిస్తున్నట్లు తెలిసిన విషయమే. ఈమె కోసం కథలో కొన్ని మార్పులు చేస్తున్నారని బాలీవుడ్ కథనాల ప్రకారం సమాచారం. అసలు మొదట శ్రద్ధా ప్లేస్ లో హాలీవుడ్ నటి డైసీ ఎడ్గార్ జోన్స్‌ తారక్ కి జోడిగా నటించాల్సి ఉంది.

కేవ‌లం వదంతేనా..?

కానీ కొన్ని కారణాల వల్ల డైసీ సినిమా నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ప్లేస్ లోకి శ్రద్ధాను ఎంపిక చేయబోతున్నట్లు వార్తలు వ‌స్తున్నాయి. ఎంచుకుంటే ఎంచుకున్నారు కానీ అసలు కథలో మార్పులు చేయాల్సిన అవసరం ఏంటి? మరి కథలో మార్పులు చేసాక శ్రద్ధా కపూర్‌ డేట్స్‌ కుదరకపోతే పరిస్దితి ఏమిటి అంటే పరిణితి చోప్రాను ఎంపిక చేసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోందిట. ఇదంతా చూస్తుంటే ఏదో గాసిప్ లాగా అనిపించటం లేదు. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ అయితే హీరోయిన్స్ కోసం కథలో మార్పులు చేస్తారు కానీ ఇటువంటి సినిమాల్లో అంటే కష్టం. సో ఇదంతా ఒక రూమర్ అని కొట్టిపారేయడమే. #RRR లో చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రలో, తారక్‌ కొమరం భీమ్ పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే తారక్ కి జోడి ఎవరు అనేది తెలియనుంది.

Tags:    

Similar News