జులై పక్కా అంటున్నాడు కానీ..!!

ప్రభుత్వం అనుమతులు వచ్చేసాయ్.. టెస్ట్ షూట్ అవుతుంది… ఆచార్య, RRR, రాధేశ్యాం, అల్లు అర్జున్ పుష్ప, మహేష్ సర్కారు వారి పాట ఇలా అన్ని సినిమాలు వరసబెట్టి [more]

Update: 2020-06-26 08:13 GMT

ప్రభుత్వం అనుమతులు వచ్చేసాయ్.. టెస్ట్ షూట్ అవుతుంది… ఆచార్య, RRR, రాధేశ్యాం, అల్లు అర్జున్ పుష్ప, మహేష్ సర్కారు వారి పాట ఇలా అన్ని సినిమాలు వరసబెట్టి పట్టాలెక్కుతాయి అని ఎదురు చూస్తున్న వారికీ కరోనా రోజు రోజుకి షాకిస్తూనే ఉంది. హైదరాబాద్ లో కరోనా కేసులు లెక్కకు మించి ఉండడంతో.. భౌతిక దూరం పాటిస్తూ షూటింగ్ చెయ్యడం, అనేక ఆంక్షల మధ్యన షూటింగ్ చెయ్యడం అంత వీజీ కాదన్నది.. రాజమౌళి లాంటి పెద్ద డైరెక్టర్ కే తెలిసొచ్చింది. చిరు పెద్ద గ్యాంగ్ ని వేసుకుని ప్రభుత్వం చుట్టూ తిరిగి అనుమతి తెచ్చినా… ఆచార్య తో ఆయన సెట్స్ మీది కెళ్ళడం లేదు. ఆగస్టు నుండే షూటింగ్స్ అంటూ వార్తలొస్తున్నాయి.

మరోపక్క రాజమౌళి ఎలాగైనా టెస్ట్ షూట్ చేసి RRR షూటింగ్ మొదలెడమనుకుంటే హీరోలు సహకరించడం లేదు.. పాన్ ఇండియా మూవీ కాబట్టి.. బాలీవుడ్ నటులు, తమిళ నటులు  అందరూ RRR కోసం రావడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు కనక షూటింగ్ మొదలు పెట్టకపోతే అందరిది డేట్స్ ప్రోబ్లెంస్ వచ్చి అడ్డంగా ఇరుక్కుంటామని రాజమౌళి టెంక్షన్ పడుతున్నాడు. అందుకే టెస్ట్ షూట్ ప్లాన్ చేసినా.. అది వర్కౌట్ అవడం లేదు. చిరు లాంటి వాడు సెట్స్  మీదకెళితేనే మిగతా హీరోల్లో కదలిక వస్తుంది అనుకుంటే…. చిరు, పవన్ లాంటోళ్ళు సైలెంట్ గా సినిమా చూస్తున్నారు కానీ.. కరోనా దెబ్బకి మాట్లాడలేక పోతున్నారు. అర్జెంట్ గా అనుమతులు తెచ్చి ఇప్పుడు ఇలా కరోనా దెబ్బకి కామ్ అవడం… షూటింగ్స్ అన్ని ఆగష్టు కి షిఫ్ట్ అవడం జరిగిన రాజమౌళి మాత్రం జులై లోనే RRR షూట్ అంటున్నాడట. మరి కరోనా ఆగాలి.. రాజమౌళి మొదలెట్టాలి.. చూద్దాం కరోనా ఏం చేస్తుందో..

Tags:    

Similar News