హైప్ పెంచడానికా.. లేదంటే నిజంగానే వస్తారా?

Update: 2018-12-09 04:23 GMT

ప్రస్తుతం ఫిలింసర్కిల్స్ లోను, సోషల్ మీడియాలోనూ రామ చరణ్ - బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న వినయ విధేయరామ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి #RRR బ్యాచ్ రాజమౌళి, రామ్ చరణ్ తో కలిసి నటించబోయే మరో హీరో ఎన్టీఆర్ కూడా హాజరవుతాడని ప్రచారం మాములుగా జరగడం లేదు. రామ్ చరణ్, ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్స్ అది వేరే విషయం, రామ్ చరణ్, రాజమౌళి, రామారావు సినిమాని నిర్మిస్తున్న దానయ్య, బోయపాటి, రామ్ చరణ్ ల వినయ విధేయరామ సినిమా నిర్మాత దానయ్యే కావడం చేత రాజమౌళి, ఎన్టీఆర్ ఈ ఈవెంట్ కి హాజరవుతారని జోరుగా ప్రచారం జరుగుతుంది.

అయితే మాస్ మాస్ అంటున్న బోయపాటి సినిమాకి ఎక్కడ క్రేజ్ తగ్గుతుందో.. అలాగే వినయ విధేయరామ సాఫ్ట్ లుక్స్ కూడా పనిచేయలేదని భావించిన నిర్మాత ఇలా రాజమౌళి, ఎన్టీఆర్ లు ఈ ఈవెంట్ కి వస్తారని సన్నిహితుల దగ్గర చెబుతున్నారు కానీ.... రాజమౌళి, ఎన్టీఆర్ లు ఈ నెల మూడో వారంలో జరగబోయే వినయ విధేయరామ ఈవెంట్ కి పక్కాగా హాజరవుతారని సమాచారం అయితే లేదు. అయినా రాజమౌళి, ఎన్టీఆర్ లు రామ్ చరణ్, నిర్మాత దానయ్య కోసం వచ్చిన రావొచ్చు అని అంటున్నారు.

ఇక షూటింగ్ చివరి దశలో ఉన్న రామ్ చరణ్ వినయ విధేయరామ అప్పుడే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైంది. ఇక సినిమా విడుదలకు కేవలం నెల టైం మాత్రమే ఉండడంతో.. త్వరలోనే ప్రమోషనల్ ఈవెంట్స్ ని కూడా స్టార్ట్ చేసి సినిమా మీద హైప్ పెంచాలనుకుంటున్నారు దర్శకనిర్మాతలు. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తున్న ఈ సినిమాలో ప్రశాంత్, రాజేష్, స్నేహ వంటి నటులు నటిస్తుండగా... ఈ సినిమాకి దేవిశ్రీ సంగీతమందిస్తున్నాడు.

Similar News