చరణ్ బర్త్ డే రోజు రెండు గిఫ్ట్స్?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు ఈనెల 27 న అందరికి తెలిసిందే. అందుకే ఇప్పటినుండే మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రామ్ చరణ్ బర్త్డే [more]

Update: 2019-03-10 08:10 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు ఈనెల 27 న అందరికి తెలిసిందే. అందుకే ఇప్పటినుండే మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రామ్ చరణ్ బర్త్డే పోస్టర్స్ తో హుంగామ చేస్తున్నారు. ఈ ఏడాది వినయ విధేయ రామ తో ఫ్యాన్స్ కి డిజాస్టర్ ఇచ్చినప్పటికీ అవి ఏమి పటించుకోకుండా ఫుల్ ఖుషి లో ఉన్నారు ఫ్యాన్స్.

అయితే చరణ్ బర్త్ డే సందర్భంగా సైరా చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది దసరాకు రిలీజ్ అవ్వాలని ప్లాన్ చేసుకున్నారు కానీ ఇంతవరకు కంఫర్మ్ చేయలేదు. సో చరణ్ పుట్టిన రోజున ఇదొక అప్ డేట్ వస్తుందని భావిస్తున్నారు. సైరా రిలీజ్ డేట్ బట్టి మిగిలిన పెద్ద సినిమాలు కూడా రిలీజ్ అవ్వనున్నాయి.

రెండో చిత్రం తో నే 200 కోట్లు పైన బడ్జెట్ తో చరణ్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. టీం లో ఉన్న ప్రతి ఒక్కరిని చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాడని చరణ్‌ చూపించిన ప్రొఫెషనలిజమ్‌ గురించి చాలా గొప్పగా చెబుతున్నారు. ఇక అదే రోజు #RRR నుండి చరణ్ లుక్ రిలీజ్ అయ్యే అవకాశముందని చెబుతున్నారు.

Tags:    

Similar News