ఇంతకీ #RRR విలన్ ఎవరబ్బా..?

#RRRలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రల్లో కనిపించనున్నారు. ఇక కీలక పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. కానీ విలన్ రోల్ [more]

Update: 2019-03-16 07:45 GMT

#RRRలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రల్లో కనిపించనున్నారు. ఇక కీలక పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. కానీ విలన్ రోల్ ఎవరు? ఇంత భారీ బడ్జెట్ మూవీకి విలన్ లేడా? ఉంటే ఎవరు? అజయ్ దేవగన్ విలన్ కాదని #RRR ప్రెస్ మీట్ లో రాజమౌళి చెప్పాడు. మరి తన సినిమాల్లో విలన్ ని హీరోలతో సమానంగా ప్రొజెక్ట్ చేసే రాజమౌళి ఈసారి #RRRలో విలన్ రోల్ పెట్టలేదా? అసలు పెడితే ఎందుకు దాచిపెట్టాడు.

ఇద్దరు విలన్లు ఎవరు..?

బాహుబలిలో రానా విలన్ అని ముందే చెప్పేసిన రాజమౌళి.. ఇప్పుడు #RRR విషయంలో విలన్ ని ఎందుకు దాచాడు. ఇక #RRR లో ఉంటే విలన్స్ ఇద్దరు ఉండాలి. ఒకరు ఎన్టీఆర్ కి, మరొకరు చరణ్ కి. మరి ఒక విలన్ రోల్ గురించే స్పష్టత లేనప్పుడు మరో విలన్ రోల్ మీద క్లారిటీ ఎలా వస్తుంది. సముద్రఖనినే విలన్ గా రాజమౌళి #RRRలో చూపించబోతున్నాడా? ఏమో కానీ ప్రస్తుతం #RRR విలన్ పై ఒక క్లారిటీ లేక ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి.

Tags:    

Similar News