అందరి చూపు దాని మీదే..!

ప్రస్తుతం టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్ కూడా #RRR సినిమా ప్రెస్ మీట్ గురించి ఎదురుచూస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ [more]

Update: 2019-03-13 07:18 GMT

ప్రస్తుతం టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్ కూడా #RRR సినిమా ప్రెస్ మీట్ గురించి ఎదురుచూస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ సినిమా షూటింగ్ సెకండ్ షెడ్యూల్ లో ఉంది. ఆ షెడ్యూల్ ఈ రోజుతో హైదరాబాద్ లో ముగియనుంది. రాజమౌళి జస్ట్ #RRR అని అనౌన్స్ చేసి సినిమా ఓపెనింగ్ మీడియాకి అనుమతి లేకుండా ఎక్కడో అల్యూమినియం ఫ్యాక్టరీలో కానిచ్చేశాడు. #RRR కథపై రకరకాల వార్తలు వినబడుతున్నా ఎవరూ స్పందించడం లేదు. #RRR హీరోయిన్స్ విషయం కూడా మీడియాకి అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది.

ఇప్పటికైనా క్లారిటీ ఇస్తారా..?

ఆ మధ్యన రాజమౌళి ఒక ఇంగ్లీష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో #RRR మూవీ భారీ బడ్జెట్ తో, భారీ హంగులతో నేషనల్ వైడ్ గా తెరకెక్కుతోందని.. దేశంలోని పలు భాషల్లో విడుదలవుతుందని చెప్పాడు. ఇక రేపు హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో మార్చి 14వ తేదీన జరుగనున్న ప్రెస్ మీట్ లో రాజమౌళి #RRR హీరోయిన్స్, స్టార్ కాస్ట్ విషయంలో ఎమైనా క్లారిటీ ఇస్తాడో చూడాలి. మరి #RRRకి సంబంధించిన కీలక విషయాలు ఈ ప్రెస్ మీట్ లో రివీల్ చేస్తాడేమో అని మీడియాతో పాటు ప్రేక్షకులు, ఇండస్ట్రీ జనాలు క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. ఇక రేపు జరగబోయే ప్రెస్ మీట్ కి రామ్ చరణ్ తో పాటుగా ఎన్టీఆర్, చిత్ర బృందం కూడా హాజరవుతున్నట్లుగా చెబుతున్నారు.

Tags:    

Similar News