హీరోలు రెడీ.. షూటింగ్ స్టార్ట్..!

తెలుగులో మోస్ట్ పవర్ ఫుల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ ఫిలిం #RRR చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. దీన్ని దర్శక ధీరుడు [more]

Update: 2019-05-22 08:41 GMT

తెలుగులో మోస్ట్ పవర్ ఫుల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ ఫిలిం #RRR చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. దీన్ని దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్నాడు. దాదాపు 300 కోట్లకు పైగా బడ్జెట్ తో దానయ్య నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ మళ్లీ సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ మూడో షెడ్యూల్ ని ఉత్తర భారతంలోని గుజరాత్, మహారాష్ట్రలోని కొన్ని ప్రదేశాలలో కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు. అయితే షూటింగ్ సమయంలో ఇద్దరు హీరోలకు గాయాలు అవ్వడంతో కొన్ని రోజులు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. రీసెంట్ గా ఇద్దరు హీరోలు పూర్తిగా కోలుకోవడంతో షూటింగ్ మొదలు పెట్టడానికి సిద్ధం అవుతున్నారు.

టైటిల్ పై ఊహాగానాలు

మూడో షెడ్యూల్ లోని భాగంగా హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేక సెట్ లో షూటింగ్ కి సన్నాహాలు చేస్తుంది చిత్ర యూనిట్. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో పాటు హీరోయిన్ అలియా భట్ కూడా పాల్గొనబోతున్నారట. అలియా.. రామ్ చరణ్ కి జోడిగా కనిపించనుంది. ఇక ఎన్టీఆర్ కి హీరోయిన్ గా హాలీవుడ్ అమ్మాయిని తీసుకున్నారు కానీ ఆమె కొన్ని కారణాలు వల్ల ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో వేరే హీరోయిన్ ని వెతికే పనిలో ఉన్నారు టీం. ఇక ఈ మూవీ టైటిల్ #RRR అంటే “రామ రావణ రాజ్యం”, “రఘుపతి రాఘవ రాజారామ్” అని అనుకుంటున్నారు చాలామంది ప్రేక్షకులు.

Tags:    

Similar News